Trisha Krishnan: పెళ్లికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు మూడ్ వచ్చిందా అంటూ ట్రోలింగ్

Trisha Krishnan: సీనియర్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడున్నర పదుల వయసు దాటినా త్రిషలో అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా సినిమాలలో అవకాశాలు సంపాదిస్తూనే ఉంది. తెలుగులో, తమిళంలో సీనియర్ హీరోల సరసన మంచి ఆప్షన్‌గా మారింది. అయితే ఇప్పటివరకు త్రిష పెళ్లిచేసుకోకపోవడం ఆమె అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో పలు హీరోలతో ప్రేమాయణం నడిపినా అవి బెడిసికొట్టడంతో మానసికంగా బలహీనపడటంతోనే ఆమె పెళ్లి వైపు మొగ్గు చూపలేదని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా త్రిష పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని.. స్టేటస్‌తో సంబంధం లేకుండా ఆ వ్యక్తి మెంటాలిటీ, పర్సనాలిటీ చూస్తానని సన్నిహితులతో చెప్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్‌లు త్రిషకు కౌంటర్లు ఇస్తున్నారు. వయసు ముదిరిపోతున్న సమయంలో పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు మూడ్ వచ్చిందా అంటూ త్రిషను కొందరు ట్రోల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో కొందరు హీరోల‌తో త్రిష ఎఫైర్ నడిపి వార్తల్లోకి ఎక్కింది. టాలీవుడ్ హీరో రానాతో ఘాటుగా ఎఫైర్ న‌డుపుతూ.. ఓ ప‌బ్‌లో మందేసి మీడియాకు పబ్లిక్‌గా దొరికిపోయింది. కొన్నేళ్ళ క్రితమే పారిశ్రామికవేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే పెటాకులుగా మారింది. గత నాలుగేళ్ల నుంచి త్రిష పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నా అవి నిజం కావడం లేదు.

త్రిష పెళ్లాడేది పరిశ్రమ వ్యక్తినేనా?
ఇటీవల సీనియర్ హీరోయిన్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు త్రిష కూడా నయనతార బాటలోనే నడుస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్‌ను త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒక‌టి, రెండు చిన్న‌ హిట్ సినిమాలతో పాపులర్ అవుతున్న దర్శకుడు, త్రిష కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి త్వరలోనే త్రిష అఫీషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేయనుంది. ఆ వరుడు ఎవరో తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.

Similar Articles

Comments

తాజా వార్తల