TRP Rating: టీఆర్పీ రేటింగ్ లో బ్లాక్ బాస్టర్ మూవీస్ ఏంటో తెలుసా? లిస్ట్ ఇదిగో..

TRP Rating: టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ చాలా వచ్చాయి. వీటిలో బాక్సీఫీసు వద్దలు కొట్టిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక బాహుబలి మూవీ తర్వాత నాన్ బాహుబలి రికార్డులు అనే పదం కూడా వాడుకలోకి వచ్చి చేరింది. స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఉండే కోలాహలం వేరుగా ఉంటుంది.

ఇక రాజమౌళి లాంటి దర్శక ధీరులు తీసే మూవీస్ కంపల్సరీ హిట్ అవ్వాల్సిందే. ఇక సినిమా థియేటర్లో హిట్ కొట్టే మూవీస్ గురించి పక్కన పెడితే.. శాటిలైట్ హక్కులు పొంది.. టీవీల్లో ప్రసారమై టీఆర్పీలో దూసుకెళ్లే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్పీ రేటింగ్ లో దుమ్ము దులిపిన మూవీస్ ఏంటో ఒక్కసారి లుక్కేయండి..

అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అల వైకుంఠ పురం. ఈ మూవీకి టీఆర్పీ రేటింగ్ 29.40గా నమోదైంది. రీసెంట్ గా ఇదే ఇప్పటి వరకు హయ్యస్ట్ కావడం విశేషం. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తర్వాత స్థానంలో నిలిచింది. సరిలేరు నీకెవ్వరు మూవీ టీఆర్పీ రేటింగ్ 23.40గా నమోదైంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రెపరెపలాడేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ మూవీకి టీఆర్పీ రేటింగ్ కాస్త తక్కువగానే వచ్చింది. బాహుబలి2కి టీఆర్పీ రేటింగ్ 22.70గా నమోదైంది.

అల్లు అర్జున్ మూవీస్ ఎక్కువే..

మహేష్ బాబు నటించిన మరో మూవీ శ్రీమంతుడు. ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చింది. థియేటర్లలో హిట్ సాధించి మంచి కలెక్షన్లు రాబట్టింది. టీఆర్పీలో 22.54గా నమోదైంది. ఇక అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. ఈ మూవీ టీఆర్పీ రేటింగ్ 22.50గా ఉంది. బన్నీ మరో చిత్రం డీజే కూడా టీఆర్పీలో సత్తా చాటింది. 21.70గా నమోదైంది. ఇక బాహుబలి ది బిగినింగ్ మూవీకి టీఆర్పీ రేటింగ్ 21.54గా ఉంది. ఇక ఫిదా 21.31, గీతాగోవిందం 20.80, జనతా గ్యారేజ్ 20.69 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల