Telugu Bigboss:ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఆమెనేనట.?

Telugu Bigboss:బిగ్ బాస్-6 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్ లు పూర్తవ్వగా.. మరికొద్దిరోజుల్లో షో ముగియనుంది. నామినేషన్లు, ఎలిమినేషన్ల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారంకు సంబంధించి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ సారి నామినేషన్ల ప్రక్రియ కాస్త వినూత్నంగా బిగ్ బాస్ నిర్వహించాడు. కంటెస్టెంట్లను కన్ఫెషన్ రూమ్ పిలిచి ఒక్కొక్కరు ఇద్దరు సభ్యులను నామినేట్ చేసి కారణాలను చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

ఈ సారి కన్పెషన్ రూమ్ కి పిలిచి రహస్యంగా నామినేషన్ల ప్రక్రియ జరపడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ కెప్టెన్ కావడంతో అతడు నామినేషన్ ప్రక్రియలో లేదు. అతడిని నామినేట్ చేయడానికి లేదు. దీంతో ఈ సారి నామినేషన్లలో శ్రీహాన్ కు అత్యధికగా నాలుగు ఓట్లు పడగా.. శ్రీసత్య, ఫైమా, ఇనయా, రాజ్, ఆదిరెడ్డి, రోహిత్ నామినేషన్లలో ఉన్నారు.

రోహిత్, కీర్తి ఈ సారి నామినేషన్ల నుంచి తప్పించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రేక్షకుల నుంచి ఓటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఇనయా టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, రాజ్ ఉన్నారు. ఇక ఫైమా ఆరు, శ్రీసత్య ఏడో స్థానంలో చివరిగా ఉన్నట్లు సమాచారం. ఇదే ట్రెండ్ శుక్రవారం వరకు కొనసాగితే శ్రీసత్య ఎలిమినేట్ అవ్వడం ఖాయమని బిగ్ బాస్ వర్గాలు అభిప్రాయడపడుతున్నాయి.

శ్రీసత్య ఎలిమినేట్ అవుతుందా?

ఒకవేళ ఓటింగ్ లో మార్పులు వచ్చి ఫైమా వెనకబడి శ్రీసత్య ముందుకు వస్తే.. ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు శ్రీసత్య, ఫైమా డేంజర్ జోన్ లో కనబడుతున్నారు. ఫైమా ఆటపరంగా, ఎంటర్ టైన్‌మెంట్ పరంగా స్ట్రాంగ్ గానే ఉంది. శ్రీసత్యపై కాస్త నెగిటివిటీ ఉంది. దీంతో ఈ వారం శ్రీసత్యపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ కావడం ఖాయమని సమాచారం. ఈ వారం కంటెస్టెంట్ ను కలిసేందుకు కుటుంబసభ్యులు వస్తున్నారు. దీంతో ఈవారం ఎమోషనల్ ఉండనుంది.

Similar Articles

Comments

తాజా వార్తల