రాకెట్ ప్రయోగించాలన్నా, మెదడుకు ఆపరేషన్ చేయాలన్నా పెద్దగా తెలివితేటలు అవసరం లేదా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి

మెదడుకు శస్త్ర చికిత్సలు చేసే వైద్య వృత్తి లేదా అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొనే శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? ఆ లక్ష్యం చేరుకోవడం అంత కష్టమేమీ కాదు.ఈ రెండు వృత్తుల్లో పని చేస్తున్న వాళ్లు అందరి లాంటి వాళ్లే. మిగతా వారితో పోలిస్తే వారికి అసాధారణ తెలివితేటలేమీ లేవని పరిశోధనలో తేలింది.

329 మంది అంతరిక్ష ఇంజనీర్లు, 72 మంది న్యూరోసర్జన్లకు పరిశోధకులు కొన్ని క్లిష్టమైన పనులు అప్పగించి వాటిని పూర్తి చేయాలని చెప్పారు. ఈ ప్రయోగాల ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. సాధారణ ప్రజలకూ వారికీ మధ్య చిన్న తేడాలే తప్ప మరేమీ కనిపించ లేదు.

ఏ వృత్తిలో ఉన్న వారిలో ఎక్కువ మేథస్సు ఉందో తెలుసుకునేందుకు ఈ చిన్న ప్రయోగం చేసినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ ప్రయోగంలో కొన్ని విభాగాల్లో పని చేస్తున్న వారి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలకు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రెండు రంగాల వారికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. శాస్త్ర విజ్ఞాన రంగంలో భవిష్యత్ లో చేపట్టే నియామకాల్లో ఒకే రకమైన ప్రశ్నావళి వల్ల ఉపయోగం ఉంటుందని పరిశోధకులు సూచించారు.

రెండు గ్రూపులకు చెందిన వృత్తి నిపుణుల మేథస్సుని ఆన్‌లైన్ ద్వారా ఆరు విభాగాల్లో పరిశీలించారు. గ్రేట్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేరుతో పిలిచే ఈ పరీక్షను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ రూపొందించింది.

Similar Articles

Comments

తాజా వార్తల