Sania Mirza And Shoaib Malik: షోయబ్‌తో సానియా మీర్జా విడాకులు..!

Sania Mirza And Shoaib Malik: టెన్నీస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లి బంధానికి బీటలు వాలినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తోన్నాయి. వారిద్దరు విడిపోబోతున్నారని, విడాకులు తీసుకునేందుకు కూడా సిద్దమైపోయారంటూ మీడియాలో వస్తున్న వార్తలు సంచలనం రేపుతోన్నాయి. సోషల్ మీడియాలో ఇటీవల సానియా మీర్జా పెట్టిన పోస్టులు, పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రముఖ మోడల్‌తో షోయబ్ మాలిక్ కలిసి ఉన్నట్లు వచ్చిన ఫొటోలు వీరిద్దరి దాంపత్య బంధంలో పొరపొచ్చాలు ఏర్పడ్డాయనే వార్తలకు బలం చేకూరుస్తోన్నాయి.

వైరల్‌గా మారిన సానియా పోస్ట్

పగిలిపోయిన గుండెలు ఆ దేవుడిని వెతకడానికి ఎక్కడికి వెళ్లాలన్నట్లుగా సానియా మీర్జా ఓ పోస్ట్ పెట్టింది. అలాగే ఇటీవల తమ కుమారుడు ఇజాన్ నాలుగో బ‌ర్త్ డే వేడుక‌లు జరగ్గా.. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. క‌ష్టంగా ఉన్న రోజుల్లో ఓ క్ష‌ణం అన్న‌ట్టు సానియా కామెంట్ చేసింది. ఈ తరుణంలోనే మోడల్‌తో షోయబ్ మాలిక్ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మోడల్‌తో షోయబ్ రిలేషన్ పెట్టుకున్నాడంటూ వచ్చిన వార్తలు వీరి కాపురంలో చిచ్చు పెట్టాయనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో జరుగుతోంది.

ఇటీవల పాకిస్తాన్‌లోని ఓ పాపులర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా టెన్నీస్ అకాడమీలు ఎక్కడెక్కడ ఉన్నాయని షోయబ్‌ను యాంకర్ ప్రశ్నించాడు. దీంతో షోయబ్ తనకు అవేమీ తెలియదంటూ సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరించింది. తన భార్య అకాడమీల గురించి షోయబ్‌ను తెలియకపోవడం ఏంటి అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తోన్నాయి.

ఈ వార్తలతో సానియా, షోయబ్ మాలిక్ దాంపత్య జీవితంలో గొడవలు వచ్చాయని, త్వరలో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. సానియా ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటుండగా.. షోయబ్ ఎక్కువగా పాకిస్తాన్‌లో ఉంటున్నాడు. విబేధాల వల్లే దంపతులిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.

Similar Articles

Comments

తాజా వార్తల