ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?

పదేళ్ల కిందట, పెద్దగా పరీక్షలేమీ ఎదుర్కోకుండానే 27 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల్లో ఆయన గురించి వచ్చినన్ని కథనాలు మరే ఇతర నాయకుడి గురించీ రాలేదు. మరి ఈ పదేళ్ల కాలంలో కిమ్ జోంగ్ ఉన్ పరిపాలన ఎలా సాగింది? ఉత్తర కొరియా ప్రజలు ఏమనుకుంటున్నారు?

అది 2011 డిసెంబర్ 19….ప్యాంగ్యాంగ్ వీధులు రోదనతో నిండిపోయాయి. స్కూల్ యూనిఫారంలో ఉన్న విద్యార్థులు మోకాళ్లపై కూలబడి ఏడుస్తున్నారు. మహిళల ముఖాల్లో చెప్పలేని బాధ. తమ “ప్రియతమ నాయకుడు” కిమ్ జోంగ్ ఇల్ ఇక లేరు అనే వార్తను కఠిన నియంత్రణలో ఉండే ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. 69 ఏళ్ల వయసులో కిమ్ జోంగ్ ఇల్ మరణించారు.

ఆ సమయంలో అందరి కళ్లూ ఒకే ఒక వ్యక్తి పైన నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా కొరియా విశ్లేషకులందరూ ఆ వ్యక్తి గురించి రాసేందుకు ఆతృతపడ్డారు. ఆయనే కిమ్ జోంగ్ ఉన్. 27 ఏళ్ల వయసులోనే ఉత్తర కొరియా అధ్యక్ష పీఠానికి వారసుడిగా అవతరించారు. కానీ, ఆయన దేశాన్ని ముందుకు నడిపించగలరని ఎవరూ భావించలేదు. వయసు లేదు, అనుభవం లేదు. అలాంటి వ్యక్తికి ఒక దేశాన్ని పాలించే సత్తా ఉంటుందని ఎవరు ఊహిస్తారు?

దేశంలో సైనిక తిరుగుబాటు వస్తుందని, లేదా ఉత్తర కొరియా ఉన్నత వర్గాలు అధికారాన్ని స్వాధీనం చేసుకుంటాయని చాలామంది ఊహించారు. కానీ, ఈ యువ నియంతను ప్రపంచం తక్కువ అంచనా వేసింది. కిమ్ జోంగ్ ఉన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, “కిమ్ జోంగ్-ఉనిజం” అనే కొత్త శకానికి నాంది పలికారు.

ప్రత్యర్థుల నిర్మూలన మొదలుపెట్టి, వందలాది మరణశిక్షలను అమలుచేసి, ఆ తరువాత విదేశీ వ్యవహారాలపై దృష్టి సారించారు కిమ్. నాలుగు అణు పరీక్షలు,100 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం, అమెరికా అధ్యక్షుడితో చర్చలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అణ్వాయుధాల అభివృద్ధి లక్ష్యంగా కిమ్ చేసిన ప్రయత్నాలు ఉత్తర కొరియాకి భారమయ్యాయి. ఇప్పుడు ఆ దేశం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల కిందటి కన్నా మరింత పేదదేశంగా, మరింత ఒంటరిగా మిగిలిపోయింది.

Similar Articles

Comments

తాజా వార్తల