Dates Benefits: రోజూ ఖర్జూర పండ్లు తింటున్నారా? అయితే మీకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Dates Benefits:కొన్ని పండ్లు కొన్ని సీజనల్‌లో మాత్రమే దొరుకుతాయి. కానీ ఖర్జూరపు పండ్లు అన్ని సీజన్లలోనూ దొరుకుతాయి. ఈ పండ్లను చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టపడి తింటారు. ఎండిన ఖ‌ర్జూరాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు మార్కెట్‌లో వివిధ ర‌కాల ఖ‌ర్జూరాలు ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

ఖర్జూరపు పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో పోషకాలు కూడా బాగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ను అందిస్తాయి. శరీరానికి అవసరమయ్యే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా మంచిది.

ఖర్జూరపు పండ్లను చలికాలంలో తినడం వల్ల శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి. ఇంకా రోగ నిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపడమే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులను రాకుండా కాపాడుతాయి.

Dates Benefits: గర్భిణలు, శిశువులకు ఎంతో ఉపయోగం..
గర్భిణీలు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల శిశువుకు అవసరమైన ఐరన్, క్యాల్షియం లభిస్తాయి. ఇవి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు కంట్రోల్ అవుతుంది. పేగు సమస్యలు దూరమవుతాయి. గొంతు నొప్పి,మంట, జలుబు, వంటివి కూడా తగ్గుతాయి.

ఖర్జూరం ఎముకలను బలంగా, పటుత్వంగా ఉంచుతాయి. శరీరంలోని వాతాన్ని పోగొడుతుంది. నీరసం, నిస్సత్తువతో బాధపడేవారు రోజూ భోజనం తర్వాత ఖర్జూర పండ్లను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఖర్జూరంలోని విటమిన్-C, D స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. ఫలితంగా చర్మం స్మూత్‌గా మారుతుంది.

Similar Articles

Comments

తాజా వార్తల