Health Tips: నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి బాధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి..!!

Health Tips: ప్రపంచంలో 40 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 80 శాతం మంది ప్రజలు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక జీవన విధానంలో వ్యాయామం చేయకపోవడం, లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది నడుం నొప్పి, మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్‌లో మరింత ఇబ్బందులకు గురవుతారు. అయితే కొన్ని చిట్కాలతో నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులను నివారించవచ్చు.

మనకు ఇంట్లోనే ఎన్నో మూలికలు దొరుకుతాయి. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించం. దాదాపుగా ప్రతి ఇంట్లోని పెరట్లో వాము చెట్టు ఉంటుంది. ఈ మొక్క ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది. వాము ఆకులలో విటమిన్ కె, విటమిన్ ఎతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందువల్ల వాము ఆకులతో టీ చేసుకుని తాగినా.. వంటలలో వాడినా.. పేస్టుగా చేసి పైపూతగా శరీరానికి అప్లై చేసినా నొప్పులు ఇట్లే తగ్గిపోతాయి.

వామాకుతో చేసిన టీ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఈ టీ తాగడం వల్ల పీచు, కాల్షియం, నియాసిన్, మాంగనీస్, ఫోలేట్, లూటిన్, క్రిప్టోక్సాంటిన్ వంటి కెరోటినాయిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఈ లీఫ్ టీలను తాగడం వల్ల మీరు చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారు. వాము ఆకులలో సోడియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం సమపాళ్లలో ఉంటాయి. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ లేదా మెదడులో సంభవించే ఎలాంటి ఇన్ఫెక్షన్‌నైనా నాశనం చేయడంలో ఈ ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గుండెకు రక్షణగా నిలిచే వాము
వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. కొంచెం వామును నీళ్లలో వేసి మరిగించి రోజూ పరగడుపున తాగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. వాములో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోరు ఫ్రెష్‌గా, శుభ్రంగా ఉండేందుకు కూడా వాము ఎంతో ఉపయోగపడుతుంది.

Similar Articles

Comments

తాజా వార్తల