Pumpkin Seeds: శృంగారంలో రెచ్చిపోవాలా? అయితే రోజూ గుప్పెడు ఈ గింజలు తినండి

Pumpkin Seeds: మానవ మనుగడలో అతి కీలకపాత్ర పోషించేది శృంగారం. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో అది తన ప్రాధాన్యాన్ని కోల్పోతోంది. తీరిక లేకపోవడం ఒకవైపు, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి పలురకాల వ్యాధులు మరోవైపు శృంగారాసక్తిని చంపేస్తున్నాయి. దాంతో ఏదో మొక్కుబడిగా పిల్లల కోసమే చాలా మంది సెక్స్‌ చేస్తున్నారు.

చాలామందికి నడివయసుకొచ్చేసరికి శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అయితే వారు ఆ విషయమై డాక్టర్లను కలవడానికి సంకోచిస్తున్నారు. డాక్టర్ల వద్దకు వెళ్లలేకపోయినా.. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్‌ సామర్థ్యం కొంతవరకైనా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి గుమ్మడికాయ గింజలు.

రాత్రి ఆహారంలో రోజూ గుప్పెడు తింటే..
పుచ్చపప్పు తినడం వల్ల టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీనివల్ల మగవారిలో కోరికలు పెరుగుతాయి.  గుప్పెడు పుచ్చ పప్పు తీసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక గుప్పెడు పచ్చి వేరుశనగ గింజలు ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ రెండింటినీ రోజూ రాత్రి భోజనంలాగా తీసుకోవాలి. వీటితో పాటు కావాలంటే బాదం పప్పులను కూడా తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో ఉడికించిన ఆహారం తీసుకోకూడదు. అన్నం, చపాతీ, కూరలు వంటివి తినకూడదు ఇలా ఒక రెండు నెలల పాటు క్రమం తప్పకుండా పాటించినట్లైతే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరిగి కోరికలు పెరుగుతాయి.

యాంటీ ఆక్సిడెంట్ సెలెనియంతో పాటు విటమిన్లు ఇ, సి, డి, కె, బి నిండి ఉన్న గుమ్మడి గింజలు శృంగార సామ్రాజ్యానికి సోపానాలు. వీర్యంలో కీలకమైన శుక్రకణాల వృద్ధికి ఈ గింజలు ఎంతో ఉపకరిస్తాయి. వీటిలోని మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు మగతనాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి. శృంగార సామ్రాజ్యంలో పురుషులకు పోటీగా స్త్రీలకూ అదే స్థాయిలో గుమ్మడి గింజలు ప్రయోజనాలు అందజేస్తాయి.

Similar Articles

Comments

తాజా వార్తల