Street Food Health Issues: రోడ్డు పక్కన చిరుతిళ్లు తింటే వచ్చే సమస్యలివే!

Street Food Health Issues: రెగ్యులర్ గా ఇంట్లో భోజనం చేసి విసుగొస్తుంటుంది. కాబట్టి చాలా మంది చిరుతిళ్లకు కనెక్ట్ అవుతారు. ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తిందామని అనుకుంటారు. రోడ్డు పక్కన బండ్ల మీద కనిపించే మిర్చి, బజ్జీ, సమోస, పునుగులు లాంటి వంటకాలను తింటుంటారు. అవి చాలా టేస్టీగా ఉంటాయి కూడా. అయితే ఎప్పుడో ఒకసారి తింటే ఓకే. కానీ దీన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రం తిప్పలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిరుతిళ్లను తరచూ తింటూ ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. వీటిని తినడం వల్ల హెల్త్ దెబ్బతినడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు. రోడ్డు పక్కన మిర్చిలు, బజ్జీలు చేసే వారు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడతారు. దీంతో ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వేడి చేస్తే రంగు మారుతుంది. క్యాన్సర్ లాంటి రకరకాలు కారకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

క్యాన్సర్ రిస్క్ ఎక్కువే
క్రమం తప్పకుండా చిరుతిళ్లను తినడం వల్ల శరీరంలో కొవ్వులు పెరిగి గుండె జబ్బు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నూనెను ఒకసారి వాడితే మరోసారి దాన్ని వాడకుండా.. పక్కన పెట్టేయడమే మేలు. అలా కాకుండా వాడిన నూనెనే రిపీటెడ్ గా వాడితే కలుషితంగా మారి మనకు కష్టాలు తీసుకొస్తుంది. ఇలాంటి నూనెలతో చేసిన తినుబండారాలు తినడం వల్ల కచ్చితంగా క్యాన్సర్ వచ్చే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

మానేయడం బెటర్
ఇంత రిస్క్ ఉన్న చిరుతిళ్లను తినడం పూర్తిగా మానేస్తే మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. అలాంటి తినుబండారాలను తినాలనిపిస్తే రోడ్డు పక్కన అమ్మే బజ్జీల బండ్లను ఆశ్రయించకుండా.. ఇంట్లోనే సొంతంగా చేసుకుంటే మేలని చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యం పాడవకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. ఇంట్లో కూడా సాధ్యమైనంతంగా ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం తగ్గించడం బెటర్ అని సూచిస్తున్నారు. కాబట్టి చిరుతిళ్లకు ఇప్పటినుంచైనా దూరంగా ఉండండి.

Similar Articles

Comments

తాజా వార్తల