Husband And Wife: అభినవ సావిత్రి చేసిన పనికి అవాక్కవ్వాల్సిందే..

Husband And Wife: పెళ్ళి అనేది అందరి జీవితాల్లో ఒక మధుర జ్ఞాపకం. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి పెళ్ళి ఒక వారధి. ఇంతకు ముందు పిల్లలు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకునేవారు. పెద్దలు కూడా ఎన్నో విషయాలు చూసి సంబంధం కుదిర్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది పిల్లలు వాళ్ళకి నచ్చిన వారిని వారే ఎంచుకుని పెళ్లిచేసుకుంటున్నారు. చదువుకునేటప్పుడో పనిచేసేటప్పుడో నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు.

ఇలాంటి భార్య దొరికితే అసలు గోడలవే రావు..

వెస్టర్న్ కంట్రీస్ లో ఒక పద్దతి ప్రస్తుతం నడుస్తుంది. అదేంటంటే కాబోయే భార్యాభర్తలు తమకు కావాల్సిన విషయాలను,తమ భాగస్వామి నుంచి కోరుకుంటున్న విషయాలను ముందుగానే అగ్రిమెంట్ లో రాసుకుంటారు. దీంతో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి దంపతులు భాగస్వామి గురించి తెలుసుకునే వెసలుబాటు కలుగుతుంది. రెండవది ఒకరి ఇష్టాలు ఇంకొకరికి తెలుస్తాయి.

ఈ అగ్రీమెంట్ ఇప్పుడు భారతదేశానికి కూడా పాకింది. ఒక యువకుడు తనకి కావాల్సిన విషయాలను తన భాగస్వామితో చెప్పి తన అంగీకారం కూడా తీసుకున్నాడు. అది మాత్రమే కాదు ఆమె కూడా ఈ షరతులకు ఒప్పుకుని అగ్రీమెంట్ లో అంగీకరించింది. ఈ విషయం తెలుసుకున్న వారు అబ్బ ఇతగాడి అదృష్టమే అదృష్టం అంటున్నారు. ఇంతకీ ఈ అగ్రీమెంట్ లో ఏముందో తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే ఒక పెళ్లి కూతురు వరుడికి దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చింది. ఒక బాండ్ పేపర్ లో ఆ యువతి భర్త రాత్రి తొమ్మిది గంటలవరకూ స్నేహితులతో ఉన్నా తనకి ఇబ్బంది లేదని చెప్పింది. తన అంగీకారానికి సూచనగా బాండ్ పేపర్ మీద సంతకం కూడా చేసింది. పెళ్ళి తరువాత భర్త తనతో సమయం గడపట్లేదని స్నేహితులకే ఎక్కువ సమయం గడుపుతున్నాడని పేచీ పెట్టడం సహజమే. ఒకసారి ఈ గొడవలు విడాకుల దాకా వెళ్ళే అవకాశం ఉంది. అలా జరగకుండా ఆ యువకుడు ముందే తన భాగస్వామితో ఈ విషయం చెప్పాడు. ఆ యువతి కూడా పెద్ద మనసుతో తన అంగీకారం తెలిపింది.

Similar Articles

Comments

తాజా వార్తల