Vastu Shastra: ఇంట్లో వాస్తు దోషాలకు ఈ సలహాలు పాటించాల్సిందే..!

Vastu Shastra: మనం ఎంత సంపాదించినా ఇంట్లో సమస్యలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. వాస్తు దోషాలు లాంటివి ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులను తీసుకొస్తాయి. కాబట్టి వాటిని సరిచేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని చిట్కాలు, సలహాలను పాటించడం ద్వారా వీటిని అధిగమించొచ్చని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వాస్తు దోషాలకు తాంత్రిక సలహాలు పాటించడం ద్వారా చెక్ పెట్టొచ్చని అంటుంటారు. తాంత్రిక సూచనలు ఈ విషయంలో బాగా పని చేస్తాయని ఓ నమ్మకం కూడా ఉంది.

తూర్పు సింహద్వారం కలవారు ఇలా చేయాలి..

ఇంట్లో వాస్తు దోషాలు కలిగి నివసించే వారు ఆ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ఇంటి యజమాని హస్తంతో గుప్పెడు బియ్యం, గుప్పెడు గోధుమలను, కొద్దిగా కర్పూరాన్ని తీసుకోవాలి. వాటిని ఒక తెల్ల వస్త్రంలో మూటకట్టి ఆదివారం ఉదయం పూట సింహద్వారంపై వేలాడదీయాలి.

పడమర సింహద్వారం కలవారు..

ఇంట్లో ఉంటూ వాస్తు లోపాల వల్ల సమస్యలతో బాధపడేవారు యజమాని గుప్పెడు బియ్యం, అంతే సమాన బరువు గల పత్తి గింజలు, కర్పూరాన్ని నీలి వస్త్రాన్ని మూటగా కట్టాలి. అలా కట్టిన దాన్ని శనివారం రోజున సింహద్వారం మీద తగిలించాలి. దీని వల్ల దుష్ఫలితాల నుంచి విముక్తులై శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

ఉత్తర సింహద్వారం కలవారు..
ఇంట్లో నివసించే వారు వాస్తు లోపాలకు గురై.. పడరాని ఇక్కట్లు పడితే యజమాని గుప్పెడు పెసర్లు, బియ్యం, కూర్పూరం మిశ్రమాన్ని ఆకుపచ్చ బట్టలో మూటగట్టి సింహద్వారంపై వేలాడదీయండి. సమస్యలు తీరి సుఖవంతంగా జీవిస్తారు.

ఇంట్లో దక్షిణ గృహం ఉండి వాస్తు లోపాలతో బాధపడేవారు ఒక చిట్కాను ఫాలో అవ్వాలి. ఇంటి యజమాని గుప్పెడు కందులు , గుప్పెడు బియ్యం, కొద్దిగా కర్పూర మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎర్రటి గుడ్డలో మూటగా కట్టి సింహద్వారంపై మంగళవారం కడితే అశాంతి తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారు.

Similar Articles

Comments

తాజా వార్తల