Vastu tips: తాళం చెవులు ఇంట్లో ఎక్కడ పెడుతున్నారు? ఇలాంటి చోట అస్సలు ఉంచరాదు తెలుసా?

Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో చాలా వస్తువులు నిర్దేశించిన చోట పెడుతూ ఉంటాం. ఇంట్లోని వస్తువులు, వంట గది, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులు ఎక్కడెక్కడ ఉంచుకోవాలో వాస్తు శాస్త్రంలో సూచించారు. ముఖ్యంగా పూజ గది విషయంలోనూ, ఇంట్లో పెట్టుకోవాల్సిన బంగారం, వెండి వస్తువుల విషయంలోనూ కొన్ని ప్రత్యేక సూచనలు చేస్తున్నారు వాస్తు పండితులు.

మరోవైపు బెడ్రూమ్ విషయంలోనూ కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. మంచం ఎలాంటి ప్రదేశంలో ఉండాలి. ఏ డైరెక్షన్ లో ఉండాలో వాస్తు శాస్త్రంలో వివరంగా చెప్పారు. లాకర్ రూమ్ విషయంలోనూ అనేక జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాళం చెవులు ఇంట్లో ఎలాంటి ప్రదేశంలో ఉండాలనే సందేహం మనలో చాలా మందికి కలుతూ ఉంటుంది. దీనికి వాస్తు పండితులు సూచనలు చేస్తున్నారు.

మనలో చాలా మంది ఇళ్లలో తాళం చెవులు వినియోగిస్తుంటారు. వాటిలో బైక్ తాళం, కారు తాళం, బీరువాలు, తలుపులకు సంబంధించిన కీస్ ను ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైన స్థావరాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మర్చిపోకుండా ఒకే స్థలంలో చాలా మంది కీస్ ను ఉంచుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తు శాస్ర్తంలో తాళాలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే ఇబ్బందులు వస్తాయట.

చెక్కతో చేసిన హ్యాంగర్ మేలు..
వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో వాడే ఏరకమైన తాళం వేసినా వాటిని ఇంట్లో ఉండే డ్రాయింగ్ గదిలో పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో పాటు పూజగదిలో కూడా ఉంచరాదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. మరోవైపు వంట గదిలోనూ ఉంచకూడదట. చెక్కతో చేసిన హ్యాంగర్ ఒకటి తీసుకొని అందులో ఉంచితే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తాళం చెవికి దేవుడి బొమ్మలు అస్సలు ఉండరాదని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే శుభాలు జరుగుతాయని వాస్తు పండితులు పేర్కొంటున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల