WhatsApp: వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్లు.. ఏంటో తెలుసా?

WhatsApp: ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్లతో వస్తోంది. వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కలిగించేందుకు రెడీ అవుతోంది. ఇకమీదట ఆన్ లైన్ లో ఉన్నా హైడ్ చేసుకోవడం సులభంగా మారనుంది. ఆన్ లైన్ లో ఉన్నా మిగతా వారికి కనిపించకుండా చేసుకోవచ్చు. అలాగే సరికొత్త మెసేజ్ రియాక్షన్ ఫీచర్ ను కూడా తీసుకొస్తోంది వాట్సప్. అలాగే వాట్సప్ లో ఏవైనా ఫొటోలు పంపించడానికి పలు మార్పులు తెస్తోంది.

whatsapp feature

మీడియా ఎడిటర్ అనే కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తెస్తోంది. వీటిలో టూల్స్ కు అదనంగా బ్లర్ చేసుకొనే సౌకర్యాన్ని కూడా వాట్సప్ తీసుకొస్తోంది. వినియోగదారులు ఫొటోలను బ్లర్ చేసి పంపించే వెసులుబాటు రానుంది. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను యూజర్ల ముంగిట ఉంచుతోంది వాట్సప్. ఇకపై వాట్సప్ లో ఒకే సారి 32 మందికి కాల్స్ చేసుకోవచ్చు.

ఒకేసారి 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు

గ్రూపుల విషయంలోనూ వాట్సప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఒకేసారి 1024 మందిని యాడ్ చేసుకొనే సౌలభ్యం కలిగిస్తోంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లను వాట్సప్ తన యూజర్ల కోసం తీసుకొస్తోంది. ఎమోజీల రియాక్షన్లు, 2జీబీ ఫైల్స్ షేరింగ్, మెసేజ్ లను అడ్మిన్ డిలీట్ చేయడం లాంటి ఫీచర్లను తీసుకురానుంది.

ప్రస్తుతం ఉన్న ఫీచర్లను మీరు చెక్ చేసుకోవాలంటే అప్ డేట్ అయ్యిందో లేదో చూసుకోవాలి. వాట్సప్ యాజమాన్యం తీసుకొస్తున్న కొత్త పద్ధతులను వినియోగదారులు మెచ్చుకుంటున్నారు. గతంలో కొందరికే ఉన్న కొన్ని ఆప్షన్లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీంతో తక్షణమే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరుతోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల జోరు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, వాట్సప్.. ఏలుతున్నాయి. అత్యధిక మంది వినియోగదారుల ఫోన్లలో ఇవన్నీ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో వాట్సప్ కొత్త ఫీచర్లు తెచ్చి అందరికీ మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

Similar Articles

Comments

తాజా వార్తల