Shoaib Akthar: మీతో ఫైనల్ ఆడాలని చూస్తే.. ఇలా చేస్తారా? టీమిండియాపై అక్తర్ అసహనం..

Shoaib Akthar: టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్ కు సెమీస్ గండం పట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో సెకండ్ సెమీస్ లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో ఘోర ఓటమి చవిచూసింది రోమిత్ సేన. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడటం కొత్తేమీ కాకపోయినా మరీ బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిర్వేదానికి గురయ్యారు.

ఇక సెమీస్ లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్.. రావల్పిండి ఎక్స్ ప్రెస్.. షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. మీతో ఫైనల్స్ ఆడాలని మేం ప్లాన్ చేసుకుంటూ ఉంటే సెమీస్ లో ఇలా హ్యాండిస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు అక్తర్. మంచి అవకాశం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. మంచి పేసర్ ఒక్కరూ లేరు.. అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు అక్తర్.

టీమిండియాలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని అక్తర్ సూచించాడు. రెండో సెమీస్ లో భాగంగా భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండానే ఛేదించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఓపెనర్ అలెక్స్ హేల్స్ కలిసి సంచలన ఇన్నింగ్స్ ఆడారు. వారి దూకుడుకు ఏ దశలోనూ భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. వాస్తవానికి కోహ్లీ, హార్దిక్ పాండ్యా బాగానే ఆడారు. కానీ లక్ష్యం సరిపోలేదు. కనీసం 200 పైబడిన పరుగులు చేసి ఉంటే కనీసం పోటీ ఇవ్వగలిగేవారమన్న వాదన వినిపిస్తోంది.

వికెట్లు తీద్దామనే ఆలోచనే రాలేదా?

ఈ నేపథ్యంలో అక్తర్ స్పందిస్తూ.. టీమిండియా చెత్తగా ఆడిందన్నాడు. చెండాలంగా ఓడిపోయారని, బౌలింగ్ లో పసలేదంటూ విమర్శలు గుప్పించాడు. మణికట్టు మాంత్రికుడు చాహల్ ను ఎందుకు ఆడించలేదంటూ ప్రశ్నలు కురిపించాడు. సెలక్షన్ అస్సలు బాగోలేదని మండిపడ్డాడు. వికెట్లు తీద్దామనే ఆలోచనే లేకుండా బౌలింగ్ నడిచిందన్నాడు. బ్యాటర్లు అంతలా ఫ్రీగా ఆడుతుంటే కనీసం బౌన్సర్లు, యార్కర్లు వేద్దామన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించాడు అక్తర్. మీపై ఫైనల్స్ ఆడాలని మేం ఉంటే ఇలా చేస్తారనుకోలేదన్నాడు.

Similar Articles

Comments

తాజా వార్తల