China Plan: చైనా ఐదు వేళ్ల సిద్ధాంతం ఇదే!.. భారతదేశమే దాని లక్ష్యం

China Plan: భారతదేశానికి ఎన్ని మిత్ర దేశాలు ఉన్నా.. దాయాది దేశాలు ఉన్నవి రెండే రెండు దేశాలు. భారత్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్థాన్ ఇందులో ఒకటి కాగా.. ఇండియాకు పక్కలో బల్లెంగా ఉండే చైనా మరొకటి.

China plans

చైనా ఎప్పుడూ భారత్ లోని భూభాగం మీద కన్నేసే ఉంటుంది. అందుకే పలు ప్రాంతాల మీద తన నియంతృత్వాన్ని చూపించాలని అనుకుంటుంది. అయితే చైనా ‘ఐదేళ్ల సిద్ధాంతం’ని నమ్ముతుంది. ఇది భారత్ విషయంలో ఇబ్బందికరంగా మారింది.

ఐదేళ్ల సిద్ధాంతం ఏంటి?:

చైనా దేశం టిబెట్ దేశాన్ని అరచేతిగా, నేపాల్, లద్దాఖ్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ లను ఐదు వేళ్లుగా భావిస్తుంది. చైనా అనుకునే ఈ సిద్ధాంతం ప్రకారం.. టిబెట్ తో పాటు ఈ ఐదు ప్రాంతాలు చైనాకు సంబంధించినవే. ఇవి చైనాలో భాగమే.

భారతదేశానికి చెందిన పలు ప్రాంతాల మీద చైనా అప్పుడప్పుడు ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించడం తెలిసిందే. మరీ ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భాగమే అని చైనా చాలాకాలంగా వాదిస్తోంది. కొన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగంలోని భారతీయులను చైనా దేశస్థులుగా గుర్తిస్తూ.. గుర్తింపు కార్డులను కూడా జారీ చేయడం వివాదాస్పదమైంది.

చైనా వాదన ప్రకారం.. ఈ ఐదు ప్రాంతాల్లో నివసించే వివిధ జాతులకు చైనాలోనే మూలాలు ఉన్నాయని.. అంటే చైనాలోని భూభాగమే ఇవన్నీ అని వాదిస్తుంది. నిజానికి సైంటిఫిక్ పరంగా చూసినా కానీ ఇది అసంబద్ధమైనది. కానీ చైనా మాత్రం ఒంటెద్దు పోకడలతో ఇతర దేశాలకు మరీ ముఖ్యంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది.

భారతదేశం మిగిలిన దేశాలతో కలిసి ఎప్పటికప్పుడు నూతన విదేశీ పాలసీలను తీసుకురావడం ద్వారా అంతకంతకు మద్దతు పెంచుకుంటోంది. చైనాను ఒంటరిని చేసి, దాని ఆటలను సాగనివ్వకుండా చేయాలని భారతదేశం సాగుతోంది. కానీ చైనా మాత్రం వీటికి బెదరక తాను నమ్మిన ఐదు వేళ్ళ సిద్ధాంతాన్ని నిజం చేయాలనే ప్రయత్నాల్లో ఉంది.

Similar Articles

Comments

తాజా వార్తల