Group-1 Mains: ఫలితాలు ఆలస్యమైనా సన్నద్ధత మరువకండి.. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ ఇలా..

Group-1 Mains: గ్రూప్ వన్ మొదటి దశ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. క్వశ్చన్ పేపర్ కాస్త క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ లో ఎన్ని మార్కులు సాధిస్తే మెయిన్స్ క్వాలిఫై అవుతారనే సందేహం చాలా మందికి కలుగుతోంది. అయితే, కోర్టు కేసుల భయమూ చాలా మంది అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండబోవని స్పష్టం చేసింది. జోన్ల ప్రాతిపదికగా 1:50 నిష్పత్తిలోనే మెయిన్స్ కు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామంటూ ప్రకటించింది.

టీఎస్ పీఎస్సీ స్పష్టత ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభ్యర్థులు సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగంచేసుకోవాలని చెబుతున్నారు. ఇక గ్రూప్ 1, 2 లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారంటే చాలా మందికి న్యాయస్థానాల్లో కోర్టుల భయం వెంటాడుతుంటుంది. ఏపీలో రెండేళ్ల కిందట జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ పై కూడా అనేక కేసులు వేశారు. ఇది తెలంగాణ అభ్యర్థులు గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు.

మరోవైపు కేసులు నడుస్తున్నప్పటికీ నియామకాలు, పోస్టు భర్తీ పూర్తి అయ్యాయి. ఉద్యోగంలో చేరి జీతం కూడా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసుల గురించి ఆలోచించడం మానేసి ప్రిపరేషన్ పై దృష్టి పెట్టాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. 2019లో గోవా ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. యూపీఎస్సీ ఓవైపు కోర్టు కేసులున్నప్పటికీ పోస్టుల భర్తీ ఆపబోదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ ఇదే ఫాలో అవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ చాలా ముఖ్యం.

మెయిన్స్ కు ఎలా సన్నద్ధమవ్వాలంటే..

మెయిన్స్ సిలబస్​ గురించి సమకాలీన అంశాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక అంశాన్ని మొదట చదువుతూ సమకాలీన అంశానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. పాలిటీలో సమాఖ్య అంశాలు మౌలికంగా చదువుతూనే ఇటీవల అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదంగా మారిన అంశాన్ని జోడించుకోవాలి. ఇక జనరల్ ఎస్సేలో మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ చారిత్రక వారసత్వం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పోలీస్ సంస్కరణలు, కొత్త జాతీయ విద్యావిధానం, సివిల్ సర్వీసుల్లో కర్మయోగి తదితర సంస్కరణలు, అంతర్జాతీయంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల