Anchor Anasuya: యాంకర్ అనసూయ ఆస్తుల గురించి తెలుసా? ఎంత సంపాదించిందంటే.. !

Anchor Anasuya: హాట్ యాంకర్ అనసూయ తన అందచందాలు, ట్యాలెంట్ తో సినీ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ యాంకర్ అయ్యాక ఆమె కెరీర్ లో మరో మైలురాయిని చేరింది. తన వాక్చాతుర్యంతో అందరికీ ఆకట్టుకుంటూ క్రేజ్ సంపాదించుకుంది. మోడ్రన్, ఫ్యాషన్ కు తగ్గట్లుగా డ్రెస్ లు వేస్తూ అందాలు ఆరబోస్తూ సందడి చేస్తోంది. మరోవైపు సినిమాల్లోనూ బోలెడు అవకాశాలు అనసూయను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. గుర్తింపు మరింత పెరిగింది.

anasuya

అన్నింటికంటే మించి సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగ స్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసిన క్యారెక్టర్ అనసూయ కెరీర్ లో నిలిచిపోయే అద్భుత ఘట్టంగా ఉంటుంది. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఇలా అనేక సినిమాల్లో అవకాశాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ రాణిస్తోంది యాంకర్ అనసూయ. మరోవైపు ఈవెంట్ల ద్వారానూ భారీగా ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

యాంకర్ అనసూయ దగ్గర అన్ని కోట్ల విలువైన ఆస్తులున్నాయా?

అవకాశాలు పెరగడంతో యాంకర్ అనసూయ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం అనసూయకు హైదరాబాద్ లోనే కాస్ట్ లీ ఏరియా జూబ్లీ హిల్స్ లో సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉందని తెలుస్తోంది. అలాగే తన గ్యారేజ్ లో విలువైన కార్లు కూడా ఉన్నాయట. ఈ ప్రకారంగా అనసూయ ఆస్తులు మొత్తం సుమారు 30 కోట్లకు పైమాటే అని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతకు ముందు ప్రారంభంలో జబర్దస్త్ లో కూడా యాంకర్ అనసూయకు మంచి రెమ్యునరేషన్ ముట్టిందట. యాంకరింగ్ తో పాటు ఈటీవీ, మల్లెమాల నిర్వహించే అనేక షోల్లో అనసూయ పాలు పంచుకుంది. జబర్దస్త్ లో ఉండగానే కాస్ట్ లీ ఆడి కారు కొనుగోలు చేసిందన్న వార్తలు హల్ చల్ చేశాయి. తర్వాత సినిమాల్లోకి రాగానే ఇన్ కమ్ రెట్టింపయ్యింది. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనసూయ భారీగా ఆస్తులు పోగేసిందని చెబుతున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల