Ashu Reddy: బెడ్ పై హాట్ ఫోటోషూట్ తో రచ్చ చేసిన అషు…. డబ్బు పంపిస్తానంటూ నెటిజన్ కామెంట్

Ashu Reddy: కేవలం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకుని బుల్లి తెరపై యాంకర్ గా అడుగు పెట్టింది ఆశు రెడ్డి. అదే సమయంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక సోషల్ మీడియా లో తాను చేస్తున్న హాట్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫోటోషూట్లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఆశు రెడ్డి. హాట్ ఫొటో షూట్లు చేయడంలో అసలు వెనకడుగు వేయడం లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా అషురెడ్డి:

ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్లు పెడుతూ అభిమానులకి మరింత దగ్గరయింది. నిజానికి ఇప్పుడు తన చేతిలో సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమి లేవు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. అయితే ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని సార్లు ట్రోలింగ్ కి కూడా గురి అవుతారన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు అషురెడ్డికి కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. ఏమిటంటే లేటెస్ట్ తాను చేసిన ఫోటోషూట్లో బ్లాక్ డ్రెస్ వేసుకుని బెడ్ పైన కూర్చుని తన అందాలను ఆరబోసింది. దీనితో ఒక నెటిజన్ తనకు డబ్బును పంపిస్తా అన్నట్టుగా కామెంట్ చేసాడు. నీ ఫోన్ పే నంబర్ చెప్తే అందరం కలిసి పది పది రూపాయలు పంపుతామని మంచి బట్టలు కొనుక్కోమ్మని కామెంట్ చేసాడు.

దీనితో మిగతా నెటిజన్లు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు. అయితే దీనిపై అషు రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు. నిజానికి ఇలాంటి కామెంట్లు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వారికి సర్వ సాధారణం. దీనిపై కొంత మంది గట్టిగానే కౌంటర్లు ఇచ్చినా మరికొంత మంది సెలెబ్రిటీలు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయంపై అషురెడ్డి ఏ విధంగా స్పందిస్తుందో.

Similar Articles

Comments

తాజా వార్తల