Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఓటింగ్ లో ట్విస్ట్.. ఈ వారం నెంబర్ వన్ ఎవరంటే.. !

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారం ఓ కంటెస్టెంట్ తగ్గుతూ వస్తున్నారు. బిగ్ బాస్ టాస్క్ లను మరింత కఠినతరం చేస్తూ వస్తున్నారు. ఆట తీరులోనూ ఇంటి సభ్యులు మరింత రాటుదేలేలా చేస్తున్నారు. బిగ్ బాస్ గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి కాస్త డిఫరెంట్ గా మార్పు తీసుకొచ్చారు. కంటెస్టెంట్ల పొజిషన్ ర్యాంకింగ్ ప్రతి వారానికీ మారుతోంది. ఆటతీరును బట్టి ఓటింగ్ లో కూడా ఛేంజ్ కనిపిస్తోంది.

baladithya

ప్రస్తుతం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 9 మంది నామినేషన్లకు వచ్చారు. వీరిలో రేవంత్, ఇనయ, సుల్తానా, రోహిత్, మెరీనా, గీతూ, ఆదిరెడ్డి, బాలాదిత్య, ఫైమా, కీర్తి ఉన్నారు. తాజా ఓటింగ్ ప్రకారం మొదటి ముగ్గురు ఎవరు, తర్వాత ఎవరు కొనసాగుతున్నారో ఆసక్తికరంగా మారింది.

డామినేషన్ తో దూకుడుగా ఉన్న రేవంత్ ఈసారి కూడా వారంలో అత్యధిక ఓట్లతో నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. అతడి గేమ్ తీరు, వ్యవహార శైలి చూసి ప్రేక్షకులు ఓటేస్తున్నారు. సెకండ్ పొజిషన్లో శ్రీహాన్ కొనసాగుతుండేవాడు. అయితే, ఈ వారం ఆయన నామినేషన్స్ లో లేడు. ఆయన స్థానంలో సుల్తానా కొనసాగుతోంది. హౌస్ సభ్యులంతా ఆమెను టార్గెట్ చేయడంతో మరింత కసిగా ఆడుతోంది. మూడో స్థానంలో బాలాదిత్య కొనసాగుతున్నాడు.

బాలాదిత్యకూ సింపతీ ఓట్లు..

బాలాదిత్యకూ ఓట్లు బాగా వచ్చాయి. నాలుగో స్థానంలో ఆదిరెడ్డి కొనసాగుతున్నాడు. ఆయన ఆటతీరు మెరుగుపర్చుకోవడంతో ప్రేక్షకులు ఓట్లేస్తున్నారు. ఐదో స్థానంలో కీర్తి, ఆరో స్థానంలో శ్రీసత్య కొనసాగుతున్నారు. ఏడో స్థానంలో గీతూ రాయల్ కొనసాగుతున్నారు. మరోవైపు ప్రతి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా టాప్ 5 లో కొనసాగే ఫైమా.. ఈసారి చివరి స్థానంలో కొనసాగుతోంది. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ గా నిలిచింది.

Similar Articles

Comments

తాజా వార్తల