Bigg Boss 6 Telugu: బిగ్‌ బాస్‌కు, నాగార్జునకు నచ్చని గుణం అదే.. అందుకే బాలాదిత్య ఎలిమినేషన్‌!

Bigg Boss 6 Telugu: బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 కీలక దశకు చేరుకుంది. 10వ వారం ఎలిమినేషన్‌లో బాలాదిత్య వంతు వచ్చింది. ఇది నిజంగా ఊహించని పరిణామమేనంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అయితే, బాలాదిత్య ఎలిమినేషన్‌ కావడం ఒకరకంగా ముందే ఊహించిన పరిణామం అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. బాలాదిత్య సెలబ్రిటీ హోదాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత హుందాగానే బయటకొచ్చేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఓ లుక్కేయండి..

చైల్డ్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన బాలాదిత్య.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి కొన్ని మూవీస్‌ చేశారు. అయితే చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయారు. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ మూవీస్‌లో నటిస్తున్నారు. హౌస్‌లో గేమ్‌ ఆడుతున్న వారిలో చాలా మందికంటే బాలాదిత్య బెటరనే ఒపీనియన్‌ ఉంది. దాంతోపాటు అర్థం పర్థం లేని వాదనలు, స్ట్రాటజీతో ఇతర కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టిందీ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఎలిమినేట్‌ అయ్యాడని కొందరు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

హౌస్‌లో కావాల్సింది శాంతియుతంగా గేమ్‌ ఆడటం కాదు. రచ్చరచ్చ చేయడం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుందాగా ప్రవర్తించే వారు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండటానికి అనర్హులని చెబుతున్నారు. ఈ క్రమంలో బాలాదిత్య అతి మంచితనంతో ఈ కోవలోకే వస్తాడని, అతడిలోని శాంత స్వభావం బిగ్‌ బాస్‌కు, నాగార్జునకు నచ్చలేదంటున్నారు. అందుకే మొదటి నుంచి నాగార్జున.. బాలాదిత్యను మెచ్చుకోలేదని గుర్తు చేస్తున్నారు.

బిగ్‌ బాస్‌కు కావాల్సింది స్పైసీ కంటెంట్‌..

ఇక బయటకు వెళ్లిపోతాడు అని నిర్ణయించుకున్నారు చివరగా బాలాదిత్య గురించి నాగార్జున పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడని చెబుతున్నారు. బిగ్‌ బాస్‌లో కొనసాగాలంటే కావాల్సింది కాంట్రవర్సీ అని చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక గలాటా సృష్టిస్తూ హల్‌ చల్‌ చేస్తుండాలి. స్పైసీ కంటెంట్‌ ఇస్తుండాలి. గొడవ పడుతూ రచ్చ చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హుందాగా ప్రవర్తించే బాలాదిత్య లాంటివారి ఎలిమినేషన్‌ ఊహించిందేనంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు. హౌస్‌ నుంచి వెళ్లిపోతూ కూడా బాలాదిత్య హుందాగానే వెళ్లాడని, ఏడుపులు.. పెడబొబ్బలు లేకుండా తన డిగ్నిటీని నిరూపించుకున్నాడని చాలా మంది అప్రిషియేట్‌ చేస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల