Daggubati Rana: దగ్గుబాటి ఇంట్లో ‘డబుల్ గుడ్’ న్యూస్.. తండ్రి కాబోతున్న రానా, అంతే కాదు…

Daggubati Rana: దగ్గుబాటి రానా తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటునిగా మంచి పేరున్న హీరో. ఒక వైపు హీరోగా.. మరో వైపు విలన్ గా.. ఒకేసారి రకరకాల పాత్రలు పోషిస్తూ.. మల్టిపుల్ స్టార్ గా ఔరా అనిపిస్తున్నాడు. “లీడర్” సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన రానా.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఏ పాత్ర అయినా తగిన విధంగా నటిస్తాడని రానాకు పేరుంది. పాత్ర ఎలాంటిదైనా దానిలో ఇమిడిపోయి నటిస్తాడని టాలీవుడ్ టాక్. అందుకే “బాహుబలి”, “భీమ్లానాయక్” వంటి భారీ సినిమాల్లో విలన్ గా.. కృష్ణం వందే జగద్గురుమ్ వంటి డిఫరెంట్ సినిమాల్లో నాయకుడిగా మెప్పించగలిగాడు.

daggupati-rana

ఇక రానా జీవిత విశేషాలకు వస్తే.. రానా, మిహికాలు ప్రేమించుకున్నారు. డిసెంబర్ 2020 లో వీరికి వివాహం జరిగింది. ఈ వివాహానికి అక్కినేని, మెగా ఫ్యామిలీతో పాటు చాలా తక్కువ మంది హాజరయ్యారు. అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. రానా, మిహికాలు పెళ్లికి ముందు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరించే వారు. వారి లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుండేవారు. అవి సందర్భానుసారంగా వైరల్ అవుతూండేవి. కానీ గత కొంతకాలంగా రానా సామజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇన్ స్ట్రా లోని ఫొటోలను డిలిట్ చేశాడు.

ఇక రానా చేసిన ఈ పనులను ఆసరాగా చేసుకుని కొందరు.. రానా, మిహికాలు విడిపోతున్నారని, వారు విడాకులు తీసుకుంటారని ప్రచారం చేసారు. సమంత చైతన్య జంటలా వీరు కూడా వేరవుతారని జోరుగా ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు రానా మిహికాతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, తాను తండ్రి కాబోతున్నట్టు పేర్కొన్నాడు. ఇక ఈ పోస్ట్ తో రానా అభిమానులకు శుభవార్త చెప్పడమే కాకుండా.. తనపై వచ్చిన రూమర్స్ కి సింగిల్ షాట్ తో సడెన్ బ్రేక్ వేసేశాడు. దీనితో రానా అభిమానులు, దగ్గుబాటి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

స్టార్ హీరో విక్టరి వెంకటేశ్ అన్న కొడుకు రానా తండ్రి కావడం.. వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ కావడంతో దగ్గుబాటి ఇంట్లో డబుల్ గుడ్ న్యూస్ అంటూ అభిమానులు సంతోషపడుతున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ ఇంట్లో ఈ దీపావళికి డబుల్ ధమాకా అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఈ దీపావళికి దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇలా రెండు గుడ్ న్యూస్ లు వినడం అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం రానా.. తన బాబాయ్ వెంకటేశ్ తో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

Similar Articles

Comments

తాజా వార్తల