Nayanthara: ఇలా చేస్తే చాలు.. నయనతారతో కలసి సినిమా చూడొచ్చు..!

Nayanthara: సౌతిండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు నయనతార. కోలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్, క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ అందాల భామ.. టాలీవుడ్ లోనూ మంజి పాపులారిటీని సంపాదించారు. హీరోల పక్కన నటిస్తూనే.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ కనిపిస్తోందీ ముద్దుగుమ్మ. అందుకే ఆడియెన్స్ లో టాలెంటెడ్ యాక్టర్ గా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.

అందం, అభినయంల కలయికగా నయనతారను సినీ విశ్లేషకులు చెబుతారు. అందుకే ఆమెకు ఇన్ని సక్సెస్ లు ఉన్నాయని అంటుంటారు. ఈ అందాల తార నటించిన తాజా చిత్రం ‘కనెక్ట్‌’. రౌడీ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత, దర్శకుడు, నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మాయ’, ‘గేమ్‌ ఓవర్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అశ్విన్‌ శరవణన్‌ ఈ మూవీని తెరకెక్కించారు.

ట్రెండింగ్ లో టీజర్
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్‌ ఖేర్‌, సౌతిండియన్ సీనియర్ నటుడు సత్యరాజ్‌ లాంటి వారు ‘కనెక్ట్’ మూవీలో కీలక పాత్రలు పోషించారు. నయన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ టీజర్‌ను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా చూశారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మూవీ యూనిట్ జోరుగా సాగిస్తోంది.

కామెంట్ చేయండి.. ‘కనెక్ట్’ చూసేయండి!
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఓ క్రేజీ కాన్సెప్టును తీసుకొచ్చింది. ఈ సినిమాను హీరోయిన్‌ నయనతారతో కలసి చూసే అవకాశాన్ని ఆమె అభిమానులకు కల్పిస్తామని మూవీ టీమ్ చెబుతోంది. అందుకోసం ఈ టీజర్‌పై తమ అభిప్రాయాలను ‘కనెక్ట్‌ టీజర్‌ రియాక్షన్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో వెల్లడిస్తే సరిపోతుంది. వాటిలో అత్యుత్తమ వ్యాఖ్యలు చేసిన వారిని ఎంపిక చేసి, నయనతారతో కలసి అడ్వాన్స్‌డ్‌ స్ర్కీనింగ్‌ చూసేందుకు అవకాశం కల్పిస్తారు. నయన్ తో కలసి ఈ మూవీ చూడాలనుకుంటున్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం మీరూ టీజర్ పై రియాక్షన్ పంపించేయండి.

Similar Articles

Comments

తాజా వార్తల