Faria Abdullah: బాయ్‌ ఫ్రెండ్స్‌ ఓన్లీ ఫ్రెండ్స్‌ వరకే.. నాకంటే పెద్ద వారితోనే.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్‌

Faria Abdullah: జాతిరత్నాలు సినిమా హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. చూడటానికి నార్త్‌ ఇండియన్‌ గర్ల్‌లా కనిపించే ఈ అమ్మడు.. అచ్చమైన హైదరాబాదీ అమ్మాయే. తాను పుట్టింది, పెరిగింది, చదివిందంతా హైదరాబాద్‌ నగరంలోనేనని చెబుతోంది. దీంతో పాటు తన ఇష్టాలను తాజాగా ప్రేక్షకులతో పంచుకుంది. అవేంటో మీరూ తెలుసుకోండి..

జాతి రత్నాలు సినిమా తన కెరీర్‌లో గుర్తిండిపోతుందని ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఈ మూవీ తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది తెలిపింది. జాతిరత్నాలు సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌షో చూడ్డానికి వెళ్లేటప్పుడు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నానని తెలిపింది. ఈ మూవీలో తనకు పేరు వచ్చినా రాకున్నా తాను మాత్రం మారిపోరాదని నిర్ణయించుకున్నానంటూ తెలిపింది. ఆ వీడియో ఇప్పటికీ తన ఫోన్‌లో ఉంటుందని చెప్పింది.

తాను జీవితంలో ఏ పనీ అనుకున్న సమయానికి పూర్తి చేయలేదని ఫరియా పేర్కొంది. ఏదైనా మొదలు పెడితే మధ్యలో ఆపేస్తానంటోంది. ఓ పుస్తకం చదవడం మొదలు పెడితే మధ్యలో ఆపేసి మరో పుస్తకం అందుకుంటానంది. ఇక జాతి రత్నాలు మూవీ తర్వాత తొందరపడి సినిమాలు ఒప్పుకోలేదని, ఆ మూవీతో వచ్చిన పేరును చెడగొట్టుకోవడం ఇష్టంలేకే ముఖ్యమైన మూవీస్‌లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

త్వరలో పుస్తకం రాస్తా..

సినిమాలతో పాటు తనకు అనేక వ్యాపకాలున్నాయంటోంది ఫరియా. ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. తనకు పర్యటించడం అంటే ఇష్టమని, ఇతర ప్రాంతాల్లో కల్చర్‌, పద్ధతులు అలవాట్లను తెలుసుకోవడం అంటే ఆసక్తి అని తెలిపింది. దీనిపై త్వరలో ఓ పుస్తకం కూడా రాస్తానని వెల్లడించింది. దాంతోపాటు డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. రోజూ నృత్యం చేయకుండా ఉండలేనని చెప్పింది. పెయింటింగ్‌ కూడా ఇష్టమని చెప్పింది. ఇంకా తనకు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అంటే అమితమైన ఇష్టమని పేర్కొంది. ఐశ్వర్యరాయ్‌ అందం, నటి టబు నటన, సుస్మితాసేన్‌ లుక్స్‌ అంటే బాగా లైక్‌ చేస్తానంది. తనకు కొంత మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నా వారు కేవలం ఫ్రెండ్‌ వరకేనంది. ఇక తనకంటే వయసులో పెద్ద వారితో ఎక్కువగా సన్నిహితంగా మెలుగుతానంది. తద్వారా మంచి విషయాలు తెలుసుకోగలుగుతానంది.

Similar Articles

Comments

తాజా వార్తల