Kaanthaara Actor Naveen Bande: కాంతారా సినిమాలో నిప్పులు కక్కే ఆ కళ్ళు ఎవరివో తెలుసా?

Kaanthaara Actor Naveen Bande: కాంతారా సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్య కన్నడ చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన కెజిఎఫ్, కెజిఎఫ్ 2 ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసాయి.

ఇలా కన్నడ సినిమా ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆ సినిమాలను మరువకముందే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సరికొత్త కథలతో సినిమాలు విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అలా వచ్చిందే కాంతారా సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కథా నాయకుడుగా రిషబ్ శెట్టి నటించగా తానే స్వయంగా దర్శకత్వం వహించాడు అనే విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో దేవుడి పాత్ర చేసిన నటుడిపైనే అందరి కళ్ళు పడ్డాయి. ఈ విషయం గురించి అందరు ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే కేవలం తన కళ్ళతో తాను చేసిన అభినయంతో అందరిని కట్టిపడేసాడు. ఇప్పుడు ఆ నటుడు ఎవరా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట అభిమానులు. అయితే ఆ నటుడికి ఇంతకు ముందు సినిమాల్లో పెద్దగా అనుభవం లేదు.

తన పేరు నవీన్ బొండే. తులు భాషలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉన్నాడట. అయితే కాంతారా సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని వీడియో క్లిప్ రికార్డు చేసి సినిమా యూనిట్ కి పంపించాడట. ఆ వీడియో రిషబ్ శెట్టికి విపరీతంగా నచ్చడంతో వెంటనే పిలిచి అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో నవీన్ బండే తాను చేసిన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు చూపు తిప్పుకోకుండా చేసాడు.

Similar Articles

Comments

తాజా వార్తల