Krithi Setty: చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తర్వాత హీరోయిన్గా మారిన సొట్టబుగ్గల సొగసరి కృతి శెట్టి.. ఉప్పెన మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది. తన అందమైన చిరునవ్వుతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వరుస మూవీల్లో చాన్సులు కొట్టేసి దూసుకుపోతోంది. సినిమాలతో పాటు పలు పాపులర్ బ్రాండ్ల ప్రకటనలు చేస్తూ రాణిస్తోంది. ఉప్పెన మూవీ సమయంలోనే బాగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఉప్పెన మూవీ హిట్ కావడంతో కృతికి వరుస సినిమా ఆఫర్లు తగిలాయి. పలు ప్రాజెక్టులకు ఓకే చేసింది. వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే, ప్రస్తుతం కృతి పరిస్థితి డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కథల ఎంపికలో జాగ్రత్తపడకపోవడమే కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి మూవీ హిట్ కొట్టాక కాస్త జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వరుస ప్లాప్ సినిమాలతో కృతి ఇండస్ట్రీకి దూరమవుతోందనే వాదన కూడా వస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్లు వచ్చినంత కాలమే ఆఫర్లు వెంట వెంటనే వస్తుంటాయి. ఒక్కసారి డిజాస్టర్లు మొదలైతే ఇక అవకాశాలు తగ్గుముఖం పడతాయి. కృతి శెట్టి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అనే మూవీ ప్లాప్ అయ్యింది.
ఇకనైనా జాగ్రత్త పడకపోతే కష్టమే..
ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ కూడా భారీ డిజిస్టర్గా నిలిచింది. మరోవైపు రామ్ పోతినేని సరసన నటించిన ది వారియర్ సినిమాదీ అదే పరిస్థితి. ఇలా వరుస ప్లాపులతో కృతి సమతమతం అవుతోంది. ఇకనైనా కథల ఎంపికలో జాగ్రత్త వహించకపోతే కెరీర్ గాడితప్పే ప్రమాదం ఉందని సినీ పండితులు హెచ్చరిస్తున్నారు. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్లనే ప్లాపులు మూటగట్టుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్టు వచ్చి తెరమరుగైన చందంగా.. కృతి శెట్టి పరిస్థితి కూడా తయారవుతుందని చెబుతున్నారు.