Mahesh Babu: మహేష్‌బాబు కూడా విగ్ వాడతాడు.. కీలక విషయాలు బయటపెట్టిన మేకప్‌మెన్

Mahesh Babu: సూపర్‌స్టార్ కృష్ణ చనిపోవడంతో ఆయనకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన చాలామంది సన్నిహితులు, స్నేహితులు,కో ఆర్టిస్ట్ లు కృష్ణ గురించి కీలక విషయాలు బయటపెడుతున్నారు. ఆయనతో తమకున్న మధురానుభూతులను పంచుకుంటూనే.. ఆయనకు సంబంధించి ప్రేక్షకులను తెలియని కొత్త విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా కృష్ణకు మేకప్‌మెన్‌గా చాలా ఏళ్లు పనిచేసిన మాధవరావు ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

కృష్ణ హీరోగా ఉన్నంతకాలం ఆయనకు మాధవరావు మేకప్‌మెన్‌గా పనిచేశారు. శ్రీ శ్రీ సినిమా వరకు ఆయనే పనిచేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మాములుగానే కృష్ణ విగ్గు పెట్టుకునే వారని, దాని వల్ల ఆయన జట్టు మొత్తం ఊడిపోయి బట్టతల వచ్చిందని తెలిపారు. అసాధ్యుడు సినిమాలో మొదటసారి కృష్ణ విగ్గు పెట్టుకున్నారని, అప్పుడు ఆయనకు జుట్టు ఉన్నా హీరో పాత్రకు డిఫరెంట్ హెయిర్ స్ట్రైల్ ఉండాలనే ఉద్దేశంతో విగ్ పెట్టుకునేవారని చెప్పారు.

మహేష్ అందుకే విగ్ వాడతాడు

ఇక మహేష్ బాబు గురించి కూడా మాధవరావు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మహేష్ బాబుకు తన మేనల్లుడు పట్టాభి మేకప్‌మెన్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. మహేష్ కూడా కొంచెం విగ్ వాడతారని చెప్పుకొచ్చారు. మహేష్ కు జుట్టు కొంచెం పలచగా ఉంటుందని, అందుకే విగ్ వాడతారని చెప్పారు. తాను మహేష్ కు కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మేకప్ వేసినట్లు మాధవరావు తెలిపారు.

ఇక కృష్ణతో తాను చివరి వరకు కలిసి ఉన్నట్లు మాధవరావు తెలిపారు. చనిపోయే ఐదు రోజుల ముందు కూడా ఆయనతో మాట్లాడినట్లు మాధవరావు తెలిపారు. కృష్ణ మృతదేహాన్ని తాను తుడిచి శుభ్రం చేసినట్లు మాధవరావు తెలిపారు. అలాగే అంత్యక్రియల సమయంలో తాను స్నానం చేయించి బొట్టు పెట్టినట్లు మాధవరావు తెలిపారు. కృష్ణ మంచి మనిషి అని, తమను బాగా చూసుకునేవారని మాధవరావు చెప్పుకొచ్చారు. మహేష్ బాబు కూడా మంచి మనిషి అని తెలిపారు.

Similar Articles

Comments

తాజా వార్తల