Nandamuri Balakrishna: బాలయ్య ఇలాంటి మూవీస్‌ వదులుకున్నాడా?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసుడిగా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన బాలయ్య.. ఎన్నో మరపురాని విజయాలను అందిచాడు. మరికొన్ని డిజాస్టర్లూ వచ్చాయి. అయితే, సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో చేయాలనుకున్న చిత్రాన్ని అప్పుడప్పుడూ మరో హీరో చేస్తుంటారు. కథ నచ్చక కావొచ్చు, డేట్స్‌ ఖాళీ లేకపోవడం.. తదితర కారణాలతో మరో హీరోకు చాన్స్‌ దక్కుతుంటుంది.

ఈ సమయంలో అలాంటి మూవీస్‌ ఒక్కోసారి బ్లాక్‌ బస్టర్‌ గా నిలుస్తుంటాయి. మరోసారి అతిపెద్ద డిజాస్టర్లుగానూ మిగులుతుంటాయి. ఇలా తాను వదులుకున్న చిత్రాలు హిట్‌ అయితే ఫీలవడం, ఫట్‌ అయితే ఆనందించడం చేస్తుంటారు సదరు హీరోలు. నందమూరి బాలకృష్ణ కూడా ఇలా అనేక రకాల చిత్రాలను వదులుకున్నాడట. వాటిలో కొన్ని ఆల్ టైమ్‌ హిట్లు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ఒక సినిమా కథను ఇద్దరు హీరోలకు చెప్పడం లాంటి పనులు కొంత మంది దర్శకులు చేస్తుంటారు. దాంతో పాటు కచ్చితంగా హిట్‌ కొడుతుందనుకున్న కథను అనేక మంది హీరోలకు చెబుతుంటారు దర్శకులు. వారిలో ఎవరు ఓకే చేస్తే వారిని విజయం వరిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తాము వదులుకున్నచిత్రం ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సందర్భాల్లో సదరు హీరోలు సాధారణంగానే బాగా ఫీల్‌ అయిపోతుంటారు. బాలకృష్ణ కూడా ఇలా హిట్‌ అయిన చిత్రాలు, డిజాస్టర్లుగా నిలిచినవి కొన్ని తన కెరీర్‌లో వదులుకున్నాడట.

భారీ హిట్లు, డిజాస్టర్లు సైతం..

బాలకృష్ణ వదులుకున్న చిత్రాల్లో జానకి రాముడు ఒటి. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో బాలయ్య చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున చేసి సూపర్‌ హిట్‌ కొట్టారు. వెంకటేష్‌ నటించి హిట్‌ కొట్టిన చంటి మూవీని కూడా తొలుత బాలయ్య వద్దకే వచ్చిందట. ఆయన రిజెక్ట్‌ చేశారు. హీరో రాజశేఖర్‌ నటించిన సింహరాశి మూవీ కూడా బాలయ్య రిజెక్ట్‌ చేసిన లిస్టులో ఉంది. మరోవైపు హరికృష్ణ, జగపతిబాబు, శివాజీ నటించిన శివరామరాజు మూవీలో హరికృష్ణ పాత్రను బాలయ్య చేయాల్సి ఉండేదట. రీమేక్‌ చేయడం ఇష్టం లేక బాలయ్య అంగీకరించలేదట. బాలయ్య రిజెక్ట్‌ చేసిన లిస్టులో ఇంకా పవన్‌ కళ్యాణ్‌ నటించిన అన్నవరం, హీరో వెంకటేష్‌ నటించిన బాడీగార్డ్‌ మూవీ, మెగాస్టార్‌ చిరంజీవి చేసిన సైరా నరసింహారెడ్డి, రవితేజ నటించిన క్రాక్‌ మూవీ, జూనియర్‌ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీలు ఉన్నాయట.

Similar Articles

Comments

తాజా వార్తల