Cinemas In OTT: ఈ నెలలో ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఇవే..

Cinemas In OTT: కరోనా తగ్గినా ఓటీటీలో సినిమాల హవా తగ్గడం లేదు. కరోనా సమయంలో థియేటర్లు మూతపడటం వల్లన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో థియేటర్లలో సినిమాలో విడుదల అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు ఇంకా ఓటీటీలోనే రిలీజ్ చేస్తోన్నారు. నెలలో రెండు, మూడు పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా పెద్ద ఎత్తున ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అవుతోన్నాయి. అందులో భాగంగానే ఈ నెలలో కూడా చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతోన్నాయి. అవి ఏంటో చూద్దాం

సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే

క్లాస్ ఫ్యామిలీ 2, బిహైండ్ ఎవ్రీ స్టార్, Minions & More Volume 2, Neal Brennan: Blocks, Triviaverse సినిమాలు ఈ నెలలో ఓటీటీలలో విడుదల అవుతున్నాయి. క్లాస్ ఫ్యామిలీ 2 విషయానికొస్తే.. ఈ సినిమా నడివి గంట ముప్పై ఎనిమిది నిమిషాలు ఉంది. రూబెన్ వాండెన్‌బోర్రే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వారసత్వం, కుటుంబ సంబంధాల కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక బిహైండ్ ఎవ్రీ స్టార్ వెబ్ సిరీస్ కూడా వస్తోంది. ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. సెంగ్రి యోంగ్ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ఫ్రెంచ్ టీవీ సిరీస్ కాల్ మై ఏజెంట్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో మాత్రమే ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

లీ సియో జిన్, క్వాన్ సన్ యంగ్, సియో హ్యున్, జూన్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు. ఇక వీటితో పాటు పలు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల