Punam Bajwa: హీరోయిన్ పూనమ్ బజ్వా ఆ దర్శకుడితో ప్రేమలో ఉందా?

Punam Bajwa: పూనమ్ బజ్వా … ఈ హీరోయిన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ తన అందచందాలతో ఒకప్పుడు యూత్ ని తన వైపుకు తిప్పుకుంది. నాగార్జున బాస్ సినిమా చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. బాస్ సినిమాలో తాను చేసింది సెకండ్ హీరోయిన్ పాత్రే అయినా చూపును తన వైపు నుండి తిప్పుకోకుండా చేసింది. తన అందంతో అభినయంతో అందరిని మెప్పించింది. నిజానికి బాస్ చిత్రం తన మొదటి మూవీ అయితే కాదు. అంతకు ముందు నవదీప్ సరసన రెండు సినిమాల్లో నటించింది.

పూనమ్ బజ్వా గురించి..

ముంబైలో పుట్టిన ఈ సొగసు కళ్ళ సుందరి పంజాబీ అమ్మాయి. 2005 లో మిస్ పూణేగా ఎంపికయింది. అలా మోడలింగ్ లో తన అడుగులను వేస్తూ హైదరాబాద్ కి ఒక ఈవెంట్ కోసం రాగా, ఆ సమయంలో ఒక దర్శకుడు తన అందానికి ఫిదా అయిపోయాడు. అదే సమయంలో సినిమాల్లో నటిస్తావా అని అడిగాడట. ఇక తాను ఉన్నది మోడలింగ్ ఫీల్డ్ యే. నిజానికి చాలా మంది కథా నాయికలు కూడా ఈ ఫీల్డ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన వారే. అలా తాను కూడా మోడలింగ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అలా కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో మొదటి సారి నటించింది.

ఆ తర్వాత తెలుగుతో పాటు వివిధ భాషల్లో కలిపి ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది. నిజం చెప్పాలంటే తన అందంతో పాటు మంచి టాలెంట్ కూడా ఉంది. కానీ తనకి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి. అంతే కాకుండా కథలు ఎంచుకునే విషయంలో క్లారిటీ లేకపోవడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. అయితే ఇప్పటికి తాను సోషల్ మీడియా లో మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది. ఇలా తాను సునీల్ కుమార్ రెడ్డి అనే తెలుగు దర్శకుడితో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది. ఇలా ఆ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్టు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా తాను హింట్ కూడా ఇచ్చేసింది.

ఇక సునీల్ కుమార్ రెడ్డి దాదాపు ఇరవై సినిమాలకు పైగా దర్శకత్వం వహించాడు. ఇంకా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తాను దర్శకత్వం వహించిన వాటిలో సొంత ఊరు, మిస్ లీలావతి, నేనేం చిన్న పిల్లనా? అనే సినిమాలు ఉన్నాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తుందట పూనమ్ బజ్వా. సరైన అవకాశం వస్తే మళ్ళీ ప్రేక్షకులని అలరించే అవకాశం ఉంది.

Similar Articles

Comments

తాజా వార్తల