Rambha Car Accident: రంభ కారుకు యాక్సిడెంట్… స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా ప్రమాదం

Rambha Car Accident:తెలుగు సీనియర్ నటి రంభ కారు యాక్సిడెంట్ కి గురైంది. కెనడాలోని టొరంటోలో పాఠశాల నుంచి వారి పిల్లలను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న రంభ పిల్లలు మరియు కేర్ టేకర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. అయితే రంభ కారుని మరో కారు ఢీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది. కారులో సమయానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెనవ్వడం తో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

rambha

అయితే రంభకు యాక్సిడెంట్ అయిందని తెలియడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళనకు గురి అయ్యారు. కొంత మంది సెలెబ్రిటీలు ట్విట్టర్ లో స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రంభ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. తమకు బ్యాడ్ టైం నడుస్తుందని అందుకే ఈ యాక్సిడెంట్ కి గురి అయ్యామని చెప్పుకొచ్చింది.

రంభ అసలు పేరు విజయ లక్ష్మి. ఈ నటి శ్రీలంక కి చెందిన తమిళ వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుంది. వీరికి 2010లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే వివాహం తర్వాత సినిమాలకు దూరం అయింది రంభ. సాధారణంగా వివాహం అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. కానీ తర్వాత కెనడా లో సెటిల్ అవ్వడంతో నటి రంభ సినిమాలకు పూర్తిగా దూరమయింది.

నటి రంభ తెలుగు తో పాటు తమిళ, మలయాళ మరియు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో టాప్ హీరోలతో నటించి 90వ దశకంలో తన హవా ని కొనసాగించింది. అయితే అన్ని భాషల్లో కలిపి రంభ 100 కి పైగా సినిమాల్లో నటించింది. సినిమాలలో నటించాలని చాలా సార్లు ఆఫర్లు వచ్చినా తాను ఆసక్తి చూపలేదు. సినిమాలు వద్దు అనుకున్నదో ఏమో కానీ అప్పుడప్పుడు కొన్ని టీవీ షోస్ లో మాత్రం కనిపిస్తుంది.

Similar Articles

Comments

తాజా వార్తల