Yashoda Movie: యశోద మూవీలో ఇవి గమనించారా? ఇవే సినిమాకు మైనస్ అయ్యాయా?

Yashoda Movie: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా సినిమా యశోద. ఈ మూవీ తాజాగా విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సరోగసీ నేపథ్యంలో సాగిన కథ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. హరీ, హరీష్ డైరెక్షన్ లో ఈ మూవీ నవంబర్ 11న గ్రాండ్ గా రిలీజైంది. సమంత ప్రత్యేక పాత్రలో, సమంత స్టార్ డమ్ తోనే ఈ మూవీ ముందుకు సాగుతుంది.

పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. సినిమా విడుదల కాక ముందే హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర బృందం చాలా ప్రయత్నాలు చేసింది. దీంతో పాటు రిలీజ్ కు ముందు సమంత అనారోగ్యం విషయాన్ని కూడా ప్రకటించడం, పూర్తిగా సమంత స్టార్ డమ్ ను నమ్ముకొనే యశోద మూవీని తెరకెక్కించడం జరిగాయి.

తన అనారోగ్యం కారణంగా ప్రమోషన్లు కూడాసరిగా చేయలేదని సమంత పేర్కొంది. మూవీ రిలీజైన మొదటి షోతోనే డివైడ్ టాక్ తెచ్చుకుంది యశోద సినిమా. కొందరు ఫ్యాన్స్ సినిమా అద్భుతంగా ఉందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మరోవైపు మరికొందరు సినిమా యావరేజ్అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా మిక్స్‌డ్ టాక్ రావడానికి కొన్ని కారణాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రైలర్ లో చూపింది వేరు.. ఉన్నది వేరు..

యశోద మూవీ ట్రైలర్ లో సరోగసీ నేపథ్యంలో కథ సాగుతుందని చూపిస్తారు. దీంతో చాలా మంది ఇంట్రస్టింగ్ గా ఉంటుందని భావిస్తారు. అయితే సినిమా చూసిన అనంతరం ఆ ఫీలింగ్ బదులు కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుంది. సినిమాలో ఐఫోన్ గురించి గర్భం ధరించాను అని ఓ అమ్మాయి చెబుతుంది. ఈ తరుణంలో ఈ అమ్మాయి ఏ కాలానికి చెందిన వారు అనుకోవాలో ప్రేక్షకులు తికమక పడతారు. మరోవైపు హాలీవుడ్ కు చెందిన యాక్టర్ వ్యక్తిగత పని నిమిత్తం భారత్ కు వచ్చి.. ఎలాంటి భద్రత లేని బిల్డింగ్ లో ఉండటం, అక్కడ ఈత కొట్టడం అనే ఉదంతంలో లాజిక్ మిస్సయ్యిందని చెబుతున్నారు. ఇక యాక్షన్ సీన్స్ లో కూడా కొన్ని సాగదీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Similar Articles

Comments

తాజా వార్తల