Samantha Yashoda: లేడీ సూపర్ స్టార్‌గా సమంత.. ‘యశోద’ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

Samantha Yashoda: లేడీ ఓరియేంటెడ్ సినిమాలకు సీనియర్ హీరోయిన్ అనుష్క పెట్టింది పేరు. అరుంధతి, భాగమతి సినిమాలతో హీట్ కొట్టి అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె సౌత్ ఇండియాలో సూపర్ స్టార్‌గా మారిపోయింది. కానీ ప్రస్తుతం అనుష్క సినిమాలు ఎక్కువగా చేస్తుండకపోవడంతో.. ఆమె స్థానాన్ని సమంత భర్తీ చేసే పనిలో పడింది. ఇప్పటికే సమంత పలు లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయగా.. ప్రస్తుతం యశోద సినిమాతో సమంత ముందుకు రాబోతోంది. సమంత లీడ్ రోల్‌లో హరి, హరీష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యశోద మూవీ రేపు రిలీజ్ కాబోతుంది.

సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్

శివలెంక ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది విడుదల కాబోతుండటంతో.. సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. స్టార్ హీరోల సినిమాలకు అయ్యేంత బడ్జెట్ సమంత సినిమాకు పెట్టారంటే.. ఆమెపై నిర్మాతలు ఎంత హోప్స్ పెట్టుకున్నారో అర్థమవుతోంది.

సమంతకు ఇప్పుడు అన్ని భాషల్లో నటిస్తూ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంటోంది. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ హీరోయిన్‌గా అక్కడ కూడా గుర్తింపు సంపాదించుకుంది. దీంతో సమంతకు ఉన్న క్రేజ్ కారణంగానే ఆమెపై ఇంత డబ్బులు నిర్మాతలు ఇన్వెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతకు శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా ఇప్పటికే సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చినట్లు చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్లు నిర్మాతకు బోనస్ అని అంటున్నారు.

ఈ సినిమాతో సమంత లేడీ సూపర్ స్టార్‌గా మారిందని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత… ఇంటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన యశోద టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Similar Articles

Comments

తాజా వార్తల