Bigg Boss 6 Telugu: హవ్వా.. రేవంత్ నో ఇలాంటి మాటలా.. ఇదేం ట్విస్ట్ గురూ..

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే, హౌస్ లో జరుగుతున్న కొన్ని పరిణామాలు విస్తు కలిగించేలా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సెలబ్రిటీ అయితే ఆట తీరుతో పని లేకుండా నిర్వాహకులు షోలో కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది. షోకి వచ్చే ముందే వీళ్లు ఒప్పందం కుదుర్చుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. కనీసం ఇన్ని వారాల పాటు కొనసాగాలనే నిబంధన, రెమ్యునరేషన్ విషయంలోనూ ఒప్పందం చేసుకొని హౌస్ లోకి ఎంటర్ అవుతారట.

singer revanth

ఇలాంటి కేటగిరీలోకి రేవంత్ వస్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన మొదటి నుంచి బిగ్ బాస్ లో తన యాట్యిట్యూడ్ చూపిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అని చేష్టలతో, మాటలతో ఇతర కంటెస్టెంట్లను ఇబ్బంది పెడుతున్నాడని గుర్తు చేస్తున్నారు. హౌస్ లో తన మాటే చెల్లుబాటు కావాలని, మిగతా అందరూ వేస్ట్ అనే ధోరణి అవలంభిస్తున్నాడని మండిపడుతున్నారు.

గేమ్ లో భాగంగా ఇతర కంటెస్టెంట్లపై నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాడు రేవంత్. తాజాగా ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రేవంత్ రెచ్చిపోయాడు. తన భుజాలపై ఉన్న స్ట్రిప్స్ ఆపోజిట్ టీమ్ సభ్యులు లాక్కొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో వాళ్లను ఏకంగా కొట్టేస్తాడు రేవంత్. గాయపరచకూడదని ఆదిరెడ్డి చెప్పినా వినిపించుకోడు.

నోటికొచ్చిన బూతులు తిడుతూ..

ఆటలో భాగంగా ఆదిరెడ్డి, అతని టీమ్ సభ్యులపై విరుచుకుపడతాడు రేవంత్. నా కొడకల్లారా అంటూ బూతులు అందుకుంటాడు. రోహిత్ ను నీ యమ్మా.. అంటూ సంబోధిస్తాడు. తన భర్తను బూతులు తిట్టడంతో మెరీనా రెస్పాండ్ అవుతుంది. దీంతో హోస్ట్ నాగార్జున కూడా రెండు సార్లు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ తీరు మార్చుకోడు. పదే పదే కోపాన్ని ప్రదర్శిస్తాడు. మరొకరైతే ఈపాటికి ఎప్పుడో బయటకు పంపేవారని, కానీ రేవంత్ విషయంలో అలా జరగడం లేదంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6లో ఇలా బూతులు తిట్టుకోవడం ద్వారానైనా మరింత పాపులర్, మరింత టీఆర్పీని సాధిస్తుందేమో చూడాలి.

Similar Articles

Comments

తాజా వార్తల