Sr. NTR Foodie: సీనియర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు, ఎక్కువగా ఇదే త్రాగేవాడు..!

Sr. NTR Foodie: ప్రతీ తెలుగు వాడికి అన్నగారిగా పేరుగాంచిన మన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అన్నగారిగా, సీనియర్ ఎన్టీఆర్ గా ఆయనకు ఉన్న పేరు అనన్య సామాన్యం. అద్వితీయం. ఇక వైవిధ్యమైన పాత్రలతో తన నటనకు తానే సాటిగా నిలిచారు అన్నగారు. కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా.. ఇవి తన కోసమే రూపొందించారమో అని అనిపించేలా అల్లుకుపోయి నటన, ప్రతిభ మరెవరికీ సాధ్యం కాదు.

తనకు తానే సాటి..
నట సార్వభౌములు గా కీర్తింపబడే ఎన్టీఆర్ గారు.. ఆ బిరుదుకు తగినవారు. ఎందుకంటే సాంఘికం, పౌరాణికం, వాణిజ్య ఆధారిత చలన చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు ఇలా ఏ అంశంలోనైనా తనదైన ముద్ర వేసేసారు అన్నగారు. రాముడు, కృష్ణుడు, ధూర్తుయోధనుడు, రావణుడు, కర్ణుడు, మరెన్నో.. ఆ పాత్ర ఇక మరెవ్వరికీ ఇమడదేమో అనిపించే సత్తా అన్నగారిది.

మంచి భోజన ప్రియుడు.
ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి అలవాట్ల విషయానికి వస్తే.. వారు మంచి ఆహార ప్రియులని దగ్గరి వారి ద్వారా తెలుస్తోంది. అందుకే భోజన మెనూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారట. ఉదయం టిఫిన్ లో ఇడ్లి ని నాటుకోడితో నంజుకుని తినేవారు. ఇక ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రత్యేక ఐటెమ్స్ ఆస్వాదించేవారు. అలా ప్రతి పూట భోజనం పై ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు.

ఇక పగటి పూట భోజనంలో అన్నంతో పాటు.. కోడికూర, పెరుగు, నెయ్యి తప్పకుండా ఉండేలా చూసుకునేవారు. భోజనం తరవాత జ్యూస్ తాగేవారు. ఆరోగ్యం ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఫుడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు.

Similar Articles

Comments

తాజా వార్తల