Super Machi Review: సూపర్ మచ్చి రివ్యూ

Super Machi Review: కళ్యాన్ దేవ్ సూపర్ మచ్చి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యాక్టర్ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మరో హీరో కూడా. కళ్యాన్ దేవ్ చిరంజీవి చిన్ని కూతురు శ్రీజని వివాహమాడాడు. సూపర్ మచ్చి సినిమాతో టాలీవుడ్ లోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు కళ్యాన్ దేవ్. మెగా ఫ్యామిలీ హీరోగా కాకుండా, వ్యక్తిగతంగా కళ్యాన్ దేవ్ నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ అద్భతం అంటున్నారు ప్రేక్షకులు. సూపర్ మచ్చి సినిమా విడుదలైన సందర్భంగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Super Machi Review

సూపర్ మచ్చి సినిమాకు పులి వాసు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే దీనికి కథను కూడా అందించారు. తమన్ మ్యూజిక్, శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. రిజ్వన్ తన స్వంత బ్యానర్ పై దీనిని నిర్మించారు. రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అజయ్, రాజేంద్ర ప్రసాద్ మెయన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ సింగర్ రాజు ని ఓ అమ్మాయి కలిసి నువ్వు నన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నావని అంటుంది. రాజు దాన్ని కొట్టి పారేస్తాడు. రాజు భార్యగా హీరోయిన్ అఫిషియల్ గా రిజిస్టర్ చేసుకుంటుంది. దీంతో ఇక్కడితో కథ మొత్తం మలుపు తిరుగుతుంది.

సినిమా ఎలా ఉందంటే

సూపర్ మచ్చి కథ చాలా కొత్తగా ఉంది. కళ్యాన్ దేవ్ తొలి సినిమా అయినప్పటికీ, నటన, డాన్స్, డైలాగ్ డెలీవరీ చాలా అద్భుతంగా వచ్చింది. శ్యాంకె నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్స్ సినిమాకు హైలైట్. మొత్తం ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా సూపర్ మచ్చి.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

తాజా వార్తల