Television Stars: బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన స్టార్ నటులు వీళ్లే..!!

Television Stars: ఈరోజుల్లో సినిమాల్లో అవకాశాలు రావాలంటే మాములు విషయం కాదు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అన్నా ఉండాలి.. లేదా టాలెంట్ ఉండి పాపులారిటీ అన్నా సాధించాలి. ఇప్పటికిప్పుడు పాపులారిటీ రావడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే టెలివిజన్ రంగంలో లేదా మీడియా రంగంలో అవకాశాలు పొంది రాణించడం చాలా ముఖ్యం. చాలా మంది తారలు టీవీరంగంలో అడుగుపెట్టి అక్కడ రాణించడంతో సినిమా ఇండస్ట్రీ వైపు పయనించి సక్సెస్ అందుకున్నారు. అందుకే మహర్షి సినిమాలో మహేష్ చెప్పినట్లు సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఆ జర్నీ అన్న విషయం గుర్తుంచుకోవాలి.

టీవీ స్టార్‌గా ఎదిగి సినిమా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో మొదట చెప్పుకోవాల్సింది కన్నడ హీరో యష్ గురించి. అతడు నటన మీద ఇష్టంతో టీనేజీలోనే ఇంటి నుంచి పారిపోయాడు. థియేటర్‌ ఆర్టిస్టుగా పని చేస్తూనే టెలివిజన్‌ రంగంలో పరిచయాలు పెంచుకుని సీరియళ్లలో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అలా పాపులారిటీ రావడంతో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు కేజీఎఫ్ సిరీస్‌తో స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు.

స్టార్ హీరోయిన్ నయనతార కూడా బుల్లితెర నుంచే వెండితెరకు వచ్చింది. 2003లో హీరోయిన్‌గా పరిచయం కావడానికి ముందు ఓ మలయాళం ఛానల్‌లో ప్రజెంటర్‌గా పనిచేసి ఆకట్టుకుంది. దాదాపు ఏడాదిపాటు అక్కడ పని చేసిన నయన్‌ ఆ తరవాతే వెండితెరపైన మెరిసింది. మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా బాలనటిగా సీరియళ్లు, సినిమాల్లో నటించింది. సాయిపల్లవి కూడా ఈటీవీలో ఢీ అనే షోతో తన టాలెంట్ బయటపెట్టింది. ఆమె డ్యాన్స్ చూసి పలువురు సాయిపల్లవికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.

బుల్లితెరపై రాణించిన సీతారామం హీరోయిన్
ఈ ఏడాది విడుదలైన సీతారామం సినిమా ఆశ్చర్యకర రీతిలో సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. సీత పాత్రలో అద్భుతంగా నటించి ఆమె ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. ఆమె కెరీర్ కూడా బుల్లితెరపైనే మొదలైంది. 2012లో కుంకుమ్ భాగ్య అనే సీరియల్ ద్వారా మృణాల్‌కు పేరు వచ్చింది. హీరోయిన్ నజ్రియా టీనేజ్‌లోనే మలయాళ ఛానల్‌లో క్విజ్ షోకు యాంకర్‌గా చేసి నటిగా మారింది.

Similar Articles

Comments

తాజా వార్తల