Bigboss: అన్యాయంగా అతన్ని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

Bigboss: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. రేవంత్ కీర్తి మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ నామినేషన్ ప్రక్రియలో ఉన్న విషయం తెలిసిందే. చివరి రెండు స్థానాలలో రాజ్, ఫైమాలు నిలిచారు. దీంతో ఆదివారం అనూహ్యంగా రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.

హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజుల్లో పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆ తర్వాత రాజ్ తన టాలెంట్ చూపాడు. హౌస్‌లో ఉండేందుకు అన్ని విధాలుగా అర్హుడు అనే విధంగా ప్రాముఖ్యతని చాటుకున్నాడు. టాప్5లో ఉంటాడని అందరూ అనుకోగా, బిగ్ బాస్ మాయతో మోడల్ ఇంటిబాట పట్టాడు.

Bigboss: ఇదేం లాజిక్ బిగ్ బాస్?
అన్ అఫీషియల్ పోలింగ్స్‌లో కూడా చూసినట్లయితే, ఫైమానే లీస్ట్‌లో ఉంది. ఈవిషయం నాగార్జున స్టేజ్ పైన చెప్పాడు కూడా. ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడుకోవడం వల్ల తను సేఫ్ అయి రాజ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపాడు. అసలు ఇదేం లాజిక్ అంటూ ఇప్పుడు పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉంది కాబట్టి ఫైమాని సేఫ్ చేస్తే నో ఎలిమినేషన్ ఉండాలి. లెక్క ప్రకారం అలాగే చేయాలి. కానీ, ఇదేం కాన్సెప్ట్ అంటూ పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. రాజ్‌కి బిగ్ బాస్ అన్యాయం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీపాస్ వల్ల గతంలో కూడా ఇలాగే చాలా ఎలిమినేషన్స్ జరిగాయి. కానీ, అది పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే పంపించామని బిగ్ బాస్ టీమ్ స్టేజ్ పైన నాగార్జునతో చెప్పించారు. లాస్ట్ ఇయర్ కాజల్-ఇంకా రవి ఇద్దరూ ఉన్నప్పుడు రవి ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఇది అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియా వేడెక్కింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ రాజ్ విషయంలో కూడా అలాగే జరిగింది.

కాగా బిగ్ బాస్ హౌస్‌లో ఫైమా ఆ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ని రాజ్ కోసం ఉపయోగించాలి అనుకుంది. కానీ రాజ్ ఒప్పుకోలేదు. ‘నువ్వు గెలుచుకున్నావు కాబట్టి నువ్వే హౌస్‌లో ఉండాలి ఫైమా. ఇది మీ అమ్మగారి కల’ అని రాజ్ చెబుతాడు. నాగార్జున కూడా అలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పగా చివరికి ఫైమా తనకోసమే పాస్‌ని ఉపయోగించి బయటపడుతుంది.

Similar Articles

Comments

తాజా వార్తల