Vijay Devarakonda: అవమానించిన విజయ్ దేవరకొండనే.. అలా చేశాడన్న బాలీవుడ్ హీరోయిన్!

Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి సినిమాలు చేస్తే కానీ గుర్తింపు రాదు. కానీ మరికొందరికి మాత్రం ఒకే ఒక్క సినిమాతో స్టార్ డం వచ్చేస్తుంది. అలాంటి వారు రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు.

Vijay Dewarkonda

హీరో సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ సినిమా సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ఒకే ఒక్క ట్వీట్ తో పాపులర్ అయ్యాడు. ఆ సినిమాకు కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో రాత్రికి రాత్రే స్టార్ అయిన మరో స్టార్ విజయ్ దేవరకొండ.

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ పేరుతో తీసిన సినిమాతో భారీ హిట్ కొట్టిన హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. నిజానికి అంతకు ముందు కూడా అతడు సినిమాల్లో నటించినా కానీ అర్జున్ రెడ్డితో అతడి పేరు మారుమోగిపోయింది.

ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పే విజయ్ దేవరకొండ మీద తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్లు చేసింది. ఒకప్పుడు అవహేళన చేసిన విజయ్ దేవరకొండనే ఇప్పుడు అలా చేశాడని సదరు హీరోయిన్ కామెంట్ చేసింది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?:

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ‘నీ వెనకాలే నడిచి’ అనే వీడియో సాంగ్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండతో మలోబిక బెనర్జీ అనే బాలీవుడ్ భామ నటించింది. స్వతహాగా నటి మరియు సింగర్ అయిన మలోబిక బెనర్జీ.. తాజాగా విజయ్ దేవరకొండ చేసిన ‘లైగర్’ సినిమా నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘లైగర్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. అన్ని భాషల్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీలో భారీగా ప్రమోషన్ చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. కాగా తాను విజయ్ దేవరకొండతో వీడియో సాంగ్ చేసే సమయంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ బాలీవుడ్ భామ మలోబిక బెనర్జీ సంచలన కామెంట్లు చేసింది.

తాను, విజయ్ ఎప్పుడు మాట్లాడుకున్నా.. తాను హిందీలో మాట్లాడితే, విజయ్ తెలుగులో మాట్లాడేవాడని, తనకు హిందీ రాదని విజయ్ చెబుతూ, హిందీ భాష తనకు అదేదో హిబ్రూ భాషలాగా అనిపిస్తుందని అనే వాడని మలోబిక బెనర్జీ వెల్లడించింది. ఇప్పుడు అదే హిందీ భాషలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ చేయడం తెలుసుకొని షాక్ అయినట్లు తెలిపింది.

ఒకప్పుడు అవహేళన చేసిన హిందీలోనే విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి వచ్చిందని మలోబిక బెనర్జీ తెలిపింది. అప్పుడు అవమానించిన భాషలోనే ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చిందని కామెంట్ చేసింది.

Similar Articles

Comments

తాజా వార్తల