దేశ తలసరి ఆదాయం కన్నా.. రాష్ర్ట ఆదాయం పెరిగింది: మంత్రి ఎర్రబెల్లి

సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1లక్ష829 రూపాయలు మాత్రమే నమోదయిందని కానీ 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని రాష్ర్ట పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 1లక్ష 24వేల 104 రూపాయాల తలసరి ఆదాయం, 2020-21 నాటికి 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని మంత్రి అన్నారు. పల్లెప్రగతి, వివిధ గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా పల్లెల రూపురేఖలు మారాయన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోనూ రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నాని డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లోఉన్నానని, మరికొన్ని రోజుల్లో ప్రజలను నేరుగా కలుస్తానని తెలిపారు. అనంతరం రాష్ర్ట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ముంబైలో క‌రోనా నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ఠినం చేశారు.  రోజు రోజుకు క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండ‌టంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  ఇప్ప‌టికే కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌పై నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే.   నైట్ క‌ర్ఫ్యూను కూడా అమ‌లు చేస్తున్నారు.  రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.  కేసుల పెరుగుద‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్‌లో అనుమ‌తుల‌ను నిరాక‌రించారు. సాయంత్రం 5 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు బీచ్‌లో సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ నిబంధ‌న‌లు డిసెంబ‌ర్ 31 నుంచి జ‌న‌వ‌రి 15 వ తేదీ వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, పోలీసులు స్ప‌ష్టం చేశారు.  మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజులో 198 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ్వ‌డంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది.  దేశంలో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌నే వార్త‌లు రావ‌డంతో అధికారులు దానికి త‌గిన‌విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల