క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, నష్టాలు రావడంతో ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’

క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టిన ఖమ్మం నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రామలింగస్వామి ఉపాధ్యాయుడిగా ఉంటూ వివాన్ స్కూల్ నడిపించేవారు. కరోనా కారణంగా తీవ్రమైన సమస్యలు వచ్చి పడ్డాయి. స్కూల్ కోసం డబ్బులు పెట్టిన ఆయన నష్టాల పాలయ్యారు.

అదే సమయంలో మిత్రుల సలహాతో లాక్‌డౌన్‌లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట ఐదు లక్షలు పెట్టారు. మొదట్లో బాగానే లాభం వచ్చింది. దాంతో మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టారు. దానికోసం తన దగ్గరున్న డబ్బులతో పాటు అప్పులు చేసి క్రిప్టోకరెన్సీలో పెట్టారు. దాంతో పాటుగా మరికొందరితో పెట్టుబడులు పెట్టించారు. దాదాపు రూ. 70 లక్షలు క్రిప్టోకరెన్సీలో పెట్టారు.

కానీ మొదట డబ్బులు వెనక్కి వచ్చినా ఆ తర్వాత నష్టాలు వచ్చాయంటూ తిరిగి ఇవ్వలేదని చెబుతున్నారు. “సమస్యల్లో పడ్డాం. మా దగ్గర ఉన్న బంగారం అమ్మేసి కొందరికి డబ్బులు ఇచ్చేశాం. ఇంకొన్ని అప్పులు ఉండిపోయాయి. వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. రామలింగస్వామి ఆత్మహత్య చేసుకోవడానికి అవే కారణం” అంటూ రామలింగస్వామి సన్నిహిత బంధువు నరసింహరావు బీబీసీకి తెలిపారు.

ఆన్‌లైన్ పెట్టుబడుల కోసమంటూ రామలింగస్వామి అప్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతానికి చెందిన కొందరి నుంచి కూడా ఆయన అప్పు తీసుకున్నారు. తనకు తోడుగా మరికొందరితో కూడా ఆయన పెట్టుబడులు పెట్టించారు. అయితే ఆ అప్పు తీర్చే విషయంలో డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బంది పెట్టారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

“రూ. 70 లక్షల అప్పుల్లో కొంత తీర్చేశాము. మిగిలింది కూడా తీరుస్తామని చెప్పాము. కానీ సెటిల్‌మెంట్ చేసుకుందామని పిలిచి నా భర్తను బంధించారు. బలవంతంగా కారు లాక్కున్నారు. ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారు. అంతా చెల్లిస్తామని చెప్పినా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలోకి నెట్టారు. అది ఆయన్ని కుంగదీసింది. తన సూసైడ్ లెటర్‌లో కూడా దీన్ని ప్రస్తావించారు.

Similar Articles

Comments

తాజా వార్తల