Bigg Boss 6: శ్రీసత్య అర్జున్ తరహాలో అతడిని కూడా వాడుకుంటోందా?

Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కన్నింగ్‌గా ఆలోచించే వ్యక్తుల్లో శ్రీసత్య కచ్చితంగా ఉంటుంది. ఎదుటివారిని అవసరం వచ్చినప్పుడు వాడుకుని అవసరం లేనప్పుడు వదిలేయడమే కన్నింగ్. గతంలో శ్రీసత్య అర్జున్ కళ్యాణ్‌తో ఎంతో క్లోజ్‌గా ఉండేది. కానీ అతడిని తన ఇష్టానుసారం వాడుకుంది. గేమ్‌లో అవసరం వచ్చినప్పుడు అర్జున్‌ను వాడుకుని నామినేషన్స్ సమయంలో మాత్రం తూచ్ అనేది.

sree satya

శ్రీ సత్య మనస్తత్వానికి ప్రత్యేక ఉదాహరణ హోటల్ టాస్క్. ఆ టాస్కులో తన వద్ద ఉన్న రూ.500 నగదును అర్జున్ శ్రీసత్యకు ఇచ్చేశాడు. నీకు ఫేవర్ చేయాలని నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేశాని అర్జున్ అంటే.. నాకేమీ ఊరకే ఇవ్వలేదు.. సేవలు చేయించుకుని ఇచ్చావని శ్రీసత్య కొట్టిపారేసింది. అప్పుడు అర్జున్ చాలా ఫీలయ్యాడు. శ్రీసత్య మాయలో పడి అర్జున్ తన ఆటను ఆడకుండా ఎలిమినేట్ అయిపోయాడు. అర్జున్ లేకపోవడంతో ఇప్పుడు మరొకరిని వాడుకునే పనిలో శ్రీసత్య ఉంది.

ప్రస్తుతం హౌస్‌లో శ్రీహాన్‌కు శ్రీసత్య దగ్గరైంది. గీతూ, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య గ్రూప్‌గా ఆడుతున్నారు. లాస్ట్ వీక్ చేపల టాస్కులో, ఈ వీక్ మిషన్ పాజిబుల్ టాస్కులో శ్రీహాన్‌తో కలిసే శ్రీసత్య కనిపిస్తోంది. అతడితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటోంది. అయితే శ్రీహాన్ కమిటెడ్ అన్న విషయం అందరికీ తెలుసు. గత బిగ్‌బాస్ సీజన్‌లో కనిపించిన సిరితో శ్రీహాన్ లవ్‌లో ఉన్నాడు. అర్జున్‌లా శ్రీహాన్‌ను వాడుకోవడం అంటే శ్రీసత్యకు కుదరని పని. అయితే శ్రీహాన్ వ్యవహారశైలిలో కూడా రెండు వారాలుగా మార్పు కనిపిస్తోంది.

శ్రీసత్య పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా?

శ్రీసత్యకు మనుషుల మీద నమ్మకం లేకపోవడమే ఆమె ఆలోచనలకు ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో ఆమె లవ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ప్రేమించినవాడు మోసం చేయడంతో డిప్రెషన్‌కు గురైంది. అందుకే ఆమెలో ఎమోషన్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే ఆమె ఆట పట్ల ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు. దీంతో వచ్చే రెండు వారాల్లో శ్రీసత్య ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Similar Articles

Comments

తాజా వార్తల