Janhvi Kapoor: ఆ టాలీవుడ్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్.. జాన్వీ కపూర్ ఆసక్తికర స్టేట్ మెంట్

Janhvi Kapoor: అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. శ్రీదేవి కూతురిగానే కాకుండా తనకంటూ సొంత గుర్తింపు కోసం పరిశ్రమిస్తోంది. సొంత ట్యాలెంట్ తోనే ఎదుగుతానంటూ అనేక ఇంటర్వ్యూల్లో సైతం చెబుతూ వస్తోంది. తన హాట్ అందాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొడుతోంది జాన్వీ.

jahnavi kapoor

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటించింది. నయనతార నటించిన కొలమావు కోకిల అనే చిత్రానికి ఇది రీమేక్ గా వచ్చింది. మరోవైపు మిలి అనే మూవీలో జాన్వీ నటించింది. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన హెలెన్ చిత్రానికి రీమేక్ గా మిలి సినిమా రూపొందించారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా జాన్వీ కపూర్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విశేషాలను మీడియాతో పంచుకుంది జాన్వీ.

మిలి సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చెప్పింది జాన్వీ. అంతే కాదు తన మనసుకు చాలా నచ్చిందని తెలిపింది. మిలి చిత్రం చూశాక తన తండ్రి బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యాడని జాన్వీ తెలిపింది. సినిమా అంటే దాదాపు అందరూ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచిస్తారన్న జాన్వీ.. తన తండ్రి మాత్రం స్టోరీ నచ్చిందా లేదా అని చూస్తారని తెలిపింది. జీవితంలో ఆయన పాత్రకు ఈ సినిమా కథ దగ్గరగా ఉందని జాన్వీ తెలిపింది. అందుకే ఈ స్టోరీ తన తండ్రికి బాగా నచ్చిందని వెల్లడించింది. మరో ఆలోచన లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని తన తండ్రి డిసైడ్ అయ్యాడని చెప్పింది.

జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్..

ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తీస్తే అందరికీ అందుబాటులోకి వస్తోందని తెలిపింది. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని జాన్వీ చెప్పింది. అతనితో కలిసి మూవీ చేయాలనే కోరిక ఉందంటూ జాన్వీ మనసులో మాట బయటపెట్టింది. మరో హీరో విజయ్ దేవరకొండను చూస్తే యాంగ్రీ యంగ్ మ్యాన్ గుర్తుకొస్తాడని జాన్వీ వ్యాఖ్యానించింది.

Similar Articles

Comments

తాజా వార్తల