Movies on OTT: కరోనా తర్వాత సినిమా థియేటర్లకు వెళ్లి మూవీ చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆన్లైన్లో ఓటీటీ వేదికగా సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇంట్లోనే హోమ్ థియేటర్ లాంటివి ఏర్పాటు చేసుకొని ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్ లాంటి వాటిలో సినిమాలు రిలీజ్ అయిన వెంటనే చూసేస్తున్నారు ప్రేక్షకులు.
ఓటీటీలపై కూడా వెబ్ సిరీస్‌లు, అనేక చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన ఓ నెల రోజుల తర్వాత ఓటీటీకి వచ్చి చేరుతున్నాయి. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు అయితే నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. వాటికి విపరీతమైన ఆదరణ లభిస్తుండడంతో ఓటీటీలు భారీగా లాభపడుతున్నాయి. రోజు రోజుకూ స్పెషల్ కంటెంట్‌తో వస్తూ అదరగొడుతున్నాయి.
ఇక కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తున్న వారి కోసమే ఈ వార్త. డిసెంబర్ 3న ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. టాలీవుడ్లో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ నటించిన చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ మూవీ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. వెంటనే చూసేయండి మరి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో మరిన్ని..
ఫాంటసీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్. మిల్లెర్, అగస్టా గోర్ రాసిన ఈ చిత్రాన్ని ఏఎస్ బయాట్ రచించిన ది జిన్ ఇన్ ది నైటింగేల్స్ ఐ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతోపాటు ఇల్మ్, కడ్డిల్స్ అనే హిందీ చిత్రాలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరోవైపు బార్బీ-ఇట్ టేక్స్ టు సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. గాసిప్ గర్ల్ సీజన్ 2 ఇంగ్లిష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఎంఎక్స్ ప్లేయర్లో మాస్క్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.