Bigg Boss6 Telugu: ఇంటి సభ్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!!

Bigg Boss6 Telugu:బిగ్ బాస్ ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేనంత ఉత్కంఠత నెలకొంది. ఒకదాని తర్వాత ఒక టాస్క్.. హైపును పెంచే ఇన్సిడెంట్స్.. సరికొత్త ట్విస్టులు ఎలిమినేషన్లు ఇలా నవరసాలతో సాగుతుంది బిగ్ బాస్.

వీటన్నిటి ఫలితంగా ప్రస్తుతం బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఈ వినూత్నమైన టాస్కులు ఇచ్చే క్రమంలో బిగ్ బాస్ టైటిల్ కు గెలిచే క్యాష్ ప్రైస్ ని టాస్క్ గేమ్ ఆడించి 50 లక్షల నుంచి ప్రైస్ అమౌంట్ ని 38 లక్షలకు పడిపోయేలా చేశారు. పాపం దీంతో కంటెస్టెంట్స్ బాగా సతమతమయ్యారు. ఇంటి సభ్యులను రాచి రంపాన పెడుతున్నారని విమర్శలు కురిపించారు.

మరి ఇదే కొనసాగిస్తే తన ఇమేజ్ పాడవుతుంది అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ ఇప్పుడు సరికొత్త బంపర్ ఆఫర్ ను కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు. పోగొట్టుకున్న డబ్బులు మొత్తం మళ్లీ వెనక్కి రప్పించుకుని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ వారం ఇంటి సభ్యులకు కల్పించారు. అయితే అదంతా సులువు కాదండోయ్. రకరకాల టాస్కుల ద్వారా కష్టపడి కంటెస్టెంట్స్ ఈ క్యాష్ ప్రైస్ అమౌంట్ ని పెంచుకోవాలి.

అయితే ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. టైటిల్ విన్నర్ కు క్యాష్ ప్రైస్ తో పాటు పాతిక లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని కూడా బహుమతిగా ఇవ్వబోతున్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రేక్షకులలో తన మీద ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ ని తగ్గించడం కోసం బిగ్ బాస్ బాగానే ఖర్చు పెడుతున్నాడు.

ఏది ఎలా ఉన్నా దీని పుణ్యమా అని టైటిల్ గెలుచుకునే కంటెస్టెంట్ మాత్రం నక్క తోక తొక్కి వచ్చాడు. క్యాష్ ప్రైజ్ తో పాటు ఓ ఇంటిని కూడా దక్కించుకునే అద్భుతమైన అవకాశాన్ని ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యుల్లో ఎవరు గెలుచుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం రేవంత్,ఇనాయ, రోహితుల మధ్య హోరాహోరిన టైటిల్ కోసం పోరు జరుగుతుంది. కానీ శ్రీహాన్ కూడా గత రెండు వారాల నుంచి నామినేషన్ లో లేడు. మరి అతని పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియలేదు. కానీ మొత్తానికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ పుణ్యమా అని షో మీద ఆసక్తి రేగింది.

Similar Articles

Comments

తాజా వార్తల