Chetan Bhagat: బెడ్ మీద పడుకుని యువత ఆ ఫొటోలనే చూస్తోంది

Chetan Bhagat: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫి జావేద్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు. ‘బాదే భయ్యా కీ దుల్హనియా’ సీరియల్‌తో నటిగా పరిచయమైన ఉర్ఫి ‘మేరీ దుర్గా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో పాల్గొన్న ఉర్ఫికి ఫాలోయింగ్ పెరిగింది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఉర్ఫి లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంది. కొత్తగా, విచిత్రమైన డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 39లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

తాజాగా ఉర్ఫి జావెద్‌ గురించి ప్రముఖ రచయిత చేతన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టూ స్టేట్స్’, ‘పైవ్ పాయింట్ సమ్‌ వన్’, ‘త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్’ వంటి బుక్స్‌తో దేశ వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్న ఈయన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మొబైల్‌ ఫోన్, సోషల్ మీడియాకు బానిపై భారత యువత ఏ విధంగా సమయాన్ని వృథా చేస్తుందో చెప్పారు.

Chetan Bhagat: యువతుల పిక్స్‌కు యువకుల లైకులు..
మహిళల ఫొటోలను సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికే యువత ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తుందని చేతన్ తెలిపారు. యువతుల పిక్స్‌కు యువకులు లైక్స్ కొడుతుంటారన్నారు. ఉర్ఫి జావెద్ తరహాలోనే ఫొటోలను షేర్ చేస్తే కోట్లాది లైక్స్ వస్తాయని, అందులో ఆమె తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. కెరీర్ కోసం ఆమె అటువంటి పిక్స్ షేర్ చేస్తుందని పేర్కొన్నారు. ఉర్ఫి తరహాలోనే మరో 50మంది దాకా ఉంటారని తెలిపారు. కార్గిల్‌ నుంచి దేశానికి రక్షించే విధంగా ఇండియన్ యూత్ ఉండాలి కానీ, మన యూత్ మాత్రం బెడ్ మీద పడుకుని ఉర్ఫి జావెద్ ఫొటోలను చూస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సెల్ ఫోన్ల నుంచి యువతను బుక్స్ వైపు మళ్లించేందుకు చేతన్ కృషి చేస్తున్నారు. ఆ మేరకు అనేక సెమినార్లు నిర్వహిస్తుంటారు. పుస్తకాల ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. ‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వృథా. ఈ వీడియోస్ మన మెదడును మొద్దుబారేలా చేస్తాయి. రియల్ లైఫ్‌లో వీటితో ప్రయోజనం లేదు. మనం జ్ఞానం సంపాదించుకోవడంపై సోషల్ మీడియా కంపెనీలు ఆసక్తి కరపరచవు. ఈ సంస్థలు మనకు యాడ్‌లను చూపించడానికే ఇష్టపడతాయి. ఆ విషయం యూత్‌కు అర్థం కాదు’ అని తెలిపారు.

Similar Articles

Comments

తాజా వార్తల