YouTube Classes: యూట్యూబ్‌లో వీడియోలు చూసి నీట్ ర్యాంకు సాధించిన యువతి

YouTube Classes: మట్టిలో మాణిక్యం అని నిరూపించుకుంది ఓ యువతి. పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి చదివి నీట్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది. కోచింగ్ కోసం వేలల్లో డబ్బులు ఖర్చు అవుతాయి, కోచింగ్ సెంటర్ ఫీజు పెద్ద మొత్తంలో ఉంటుంది. కుటుంబం పేదరికంలో ఉండటంతో అంత డబ్బులు కట్టే ఆర్థిక స్తోమత లేదు. దీంతో యూట్యూబ్‌లో ఉచితంగా వచ్చే వీడియో క్లాసులు విని నీట్ పరీక్షకు ప్రిపేర్ అయింది. అంతేకాదు ఆలిండియా ర్యాంక్ సాధించింది.

ఢిల్లీకి చెందిన రితిక యూట్యూబ్‌ వీడియోలు చూసి నీట్ లో మంచి ర్యాంకు సాధించింది. రితిక కుటుంబం పేదరింకలో ఉండటంతో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు. కనీసం చదువుకోవడానికి నీట్ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. దీంతో తండ్రి రితిక పెళ్లి కోసం దాచి పెట్టిన నగదు అమ్మారు. ఆ డబ్బులతో రితిక స్మార్ట్‌ఫోన్, పుస్తకాలు కొనుగోలు చేసింది.

యూట్యూబ్‌లో వీడియోలో చూసి..

పుస్తకాలు చదివి, స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు చూసి నీట్ లో మంచి ర్యాంకు సాధించింది. నీట్ లో ఆమెకు 500 మార్కులు రాగా.. ఎస్సీ విభాగంలో ఆలిండియా 3,032 ర్యాంకు సాధించింది. కోచింగ్ తీసుకుని పరీక్ష రాసే స్థోమత లేకపోవడంతో యూట్యూబ్ లో వీడియోలు విని పరీక్ష రాసినట్లు రితిక చెబుతోంది. నీట్ లో మంచి ర్యాంకు రావడంతో రితిక తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు.

రితిక తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పనిచేసేవాడు. కానీ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబ ఆర్ధిక పరిస్థితి దిగజారింది. రితికకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి వల్ల వారి చదవులకు సమస్యలు వచ్చి పడ్డాయి. కానీ రితిక కష్టపడి చదవి నీట్ లో ర్యాంక్ సాధించింది. ఆర్థిక కష్టాలను లెక్కచేయకుండా కష్టపడి చదవి ర్యాంక్ సాధించిన రితికను అందరూ అభినందిస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమెను ఎంతోమంది స్పూర్తిగా తీసుకుంటున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల