Jr NTR: ఎన్టీఆర్ 30వ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ …తానే ఎన్టీఆర్ కి కాల్ చేసి ఆఫర్ అడిగిందట!

Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై 6 నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటికి ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా సెట్స్ లోకి వెళ్ళలేదు. అభిమానులు కూడా తన సినిమా ఎప్పుడు ప్రారంభమౌతుందో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ తో ఒక సినిమా ప్రకటన చేశారు. కానీ ఇప్పటికి ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న కొరటాల శివకి ఆచార్య సినిమాతో ఒక్క సారిగా బ్రేక్ పడింది.

NTR

దీనితో కొరటాల శివ కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అభిమానులు కూడా కొరటాల శివ నుండి మళ్ళీ అలాంటి సినిమా నే కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

డైరెక్టర్ కొరటాల శివ కూడా స్క్రిప్ట్ ని ప్యాన్ ఇండియా లెవెల్లో తయారు చేసుకున్నాడట. ఇక ఈ సినిమా ప్రకటన విడుదలై చాలా రోజులే అయినా ఇప్పటికీ ఈ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 30 వ సినిమాకి సంబంధించి అభిమానులకు ఊరటనిచ్చే ఒక ప్రకటనని విడుదల చేసారు చిత్ర యూనిట్.

అదేంటంటే ఇన్ని రోజులు సినిమాకి సంబంధించి ఒక్క ప్రకటన కుడా విడుదల చేయలేదు కానీ ఇప్పుడు సినిమాలో హీరోయిన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమాలో కథ నాయిక గా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారట. అయితే మరో షాకింగ్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో నటించాలని ఉందని నేరుగా ఎన్టీఆర్ కాల్ చేసి అడిగిందట. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపొయింది. ఇక సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Similar Articles

Comments

తాజా వార్తల