Indian Cricketers: ఈ క్రికెటర్లు ప్రభుత్వ అధికారులుగా గుర్తింపు పొందారు.. ఎవరెవరో చూడండి..!

Indian Cricketers: టీమిండియాలో క్రికెటర్లుగా రాణించిన పలువురు ప్రభుత్వ అధికారులుగా కూడా గుర్తింపు పొందారు. ఓవైపు మైదానంలో బ్యాట్‌, బాల్‌తో రాణిస్తూనే.. మరోవైపు ప్రభుత్వంలో అప్పుడప్పుడూ కొలువులకు వెళ్తూ వస్తుంటారు. క్రికెట్‌ అంటే ఇష్టం ఉన్న వారు మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లను ఆరాధించే వారి సంఖ్య ఇండియాలో చాలా ఎక్కువనే చెప్పవచ్చు.

ఇండియాలో క్రికెటర్లుగా గుర్తింపు పొంది, పేరు ప్రఖ్యాతలు గడించిన వారిలో కొందరు ప్రభుత్వంలో ఉన్నతమైన పదవులు అలంకరించారు. ఇలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.. ప్రముఖ వ్యక్తి మహేంద్ర సింగ్‌ ధోని. టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఘనత క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహేంద్ర సింగ్‌ ధోనికి మాత్రమే దక్కింది.

Indian Cricketers: లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా ధోని..
ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోని.. క్రికెట్‌లోకి రాకముందు ఖరగ్‌ పూర్ రైల్వే స్టేషన్ టికెట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం చేశాడు. అది కొన్నాళ్లు చేశాక నచ్చకపోవడంతో మానేసి క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి 2011లో టీమిండియాకు ప్రపంచ కప్ సాధించిపెట్టాడు. అదే సమయంలో ధోనిని కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించింది.

ఇక మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విషయానికి వస్తే.. టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఎన్నో అవార్డులు, బిరుదులు సొంతం చేసుకున్నాడు. 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గ్రూప్ కెప్టెన్‌గా సచిన్ నియామకమయ్యారు. ఇక స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ టీమిండియాలో మంచి గుర్తింపు పొందాడు. చాహల్‌కు ఇన్‌కమ్‌ ట్యాక్స్ ఆఫీసర్‌ పోస్టును ఆఫర్‌ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించారు. మరో క్రికెటర్‌ జోగిందర్ శర్మ.. ప్రస్తుతం హర్యానా పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. ఇక హర్భజన్ సింగ్ సైతం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేశారు. ఇండియాకు తొలి వరల్డ్‌ కప్‌ అందించిన మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు.

Similar Articles

Comments

తాజా వార్తల