Shocking Love: ప్రేమ గుడ్డిది.. 19సం. యువకుడు.. 56సం. మహిళతో..!

Shocking Love: ప్రేమ గుడ్డిది.. ప్రేమ పిచ్చిది.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటుంటారు. అయితే వీటిని నిరూపించడానికి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమో! అవును.. మీరు వింటున్నది నిజమే.. ఏ వయసులో అయినా ఎవరితోనైనా ప్రేమ పుట్టవచ్చు.. ఎప్పుడైనా ప్రేమలో పడవచ్చు. ఇక ప్రేమిస్తే ఎంతకైనా తెగించడం, ఎక్కడి వరకైనా వెళ్లడం సహజమే.. కానీ కొన్ని ప్రేమ జంటలు చేసే పనులు షాకింగ్ గా ఉంటాయి. అయితే ఆ ప్రేమ జంటే షాకింగ్ అయితే.. ఇప్పుడు అలాంటి షాకింగ్ లవ్ గురించి మీరే చదవండి..

shocking-love

ప్రేమకు అంతరాలు ఉండవు. దీన్ని నిరూపించాలనుకుందో ఏమో.. ఈ థాయిలాండ్ ప్రేమజంట. అతని వయసు 19సంవత్సరాలు. నిండు యవ్వనంలో ఉన్న యువకుడు. ఆమె 56 సంవత్సరాల మహిళ. పండు ముసలితనానికి పది రోజుల దూరంలో తాను ఉంది. అయితే థాయిలాండ్ కు చెందిన ఈ 19 ఏళ్ల యువకుడు 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అంతటితో ఆగకుండా వారిద్దరి వివాహ నిశ్చితార్థం కూడా పూర్తి అవడంతో అందరు ఆశ్చర్యపోయారు.

అసలు విషయానికొస్తే.. ఉతిచాయ్ చంతరాజ్ అనే ఈ యువకుడు 9సం.ల వయసు నుండే 56సం.ల జన్లా నమువాన్ గ్రాక్ ను ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి అందరు సరదాగా తీసుకున్నారు కానీ.. అతడిలో ప్రేమ మాత్రం అలాగే పెరిగింది. నాయనమ్మ వయసు కలిగిన ఆ మహిళపై అతడి ప్రేమ.. ఇప్పుడు వివాహం వరకు వెళ్లడంతో అందరు షాక్.. ఆమెతో జరిగిన నిశ్చితార్థం వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

సినిమాల్లో కామెడీ సీన్లలో కనిపించే ఇలాంటి సంఘటన నిజంగా జరిగే సరికి అందరు ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. అందరు రకరకాలుగా మాట్లాడుతున్నా.. తాను చేసింది మాత్రం సరైనదేనని.. ఉతిచాయ్ చంతరాజ్ చెప్పుకొస్తున్నాడట. ఏదేమైనా అంత వయసున్న ఆవిడను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం సాహసోపేత నిర్ణయమని జనాలు చర్చించుకుంటున్నారు. కొందరు వింతగా, విచిత్రంగా ఈ సంఘటనను భావిస్తుండగా.. మరి కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల